పుట:Telugu merugulu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగుమెఱుంగులు

13


మని పేర్కొనబడుచున్న స్థలము లనేకము లట్టి పదాంత యకార హల్మాత్రము ద్రవించిపోఁగా నచ్చు పరమయినపుడు మరలఁ గానవచ్చుట నుబట్టి యేర్పడినవే. అట్టి దేశిశబ్దముల రూపసాజాత్య మునుబట్టి యకారపుచ్ఛము లేనివయినను తెలుఁగునఁజేరిన సంస్కృత ప్రాకృత శబ్దములకును నట్టి యడాగమము పుట్టెను. రమ + అది = 'రమ యది' ఇత్యాదులు.

పైనిఁ బేర్కొన్న విధమున నూనె పదము తెలుఁగు సంప్రదాయ పరిణామమునుబట్టి పుట్టి యుండఁగా దానిమీఁద 'నూనియ' అను రూపము ప్రాకృత భాషా సంప్రదాయమునుబట్టి పుట్టెను. 'కన్నియ' 'వన్నీయ' 'దీవియ' మొదలయిన శబ్దములు కన్యకా, వర్ణక, దీపికా శబ్దాదులనుండి ప్రాకృత సంప్రదాయమునుబట్టి పుట్టి తెలుఁగునఁ జేరినవి. వీనికి 'కన్నె 'వన్నె 'దీవె' రూపములును గలవు. వీనిపోలికనుబట్టి 'నూనె' శబ్దమునకుఁగూడ 'నూనియ' అను రూపమువచ్చెను. నూనె, నూనియ శబ్దములు పుట్టినతర్వాత వానీసాదృశ్యముచే 'తేన్' అని యజవమున రూపముగల 'మధు' వాచకశబ్దము తెలుఁగున తేనె 'తేనియ' అను రూపములఁ జెందెను.

ద్రవిడ కర్ణాట ప్రాకృత భాషల పలుకుబడి నూనె శబ్దముమీఁద నెంత చెల్లెనో పై పరిశీలనమువలనఁ దెలియవచ్చెను. కాని యిందు సంస్కృతపు పలుకుబడికూడ హెచ్చుగాఁగలదు. ఎట్లనఁగా "నెయ్' అను పదము దేశిపద మని కొంద అన్నను 'స్నేహమను సంస్కృత పదమునకు వికృతియని కొంద బందురు.

ద్రవిడభాషలో 'నెయ్' పదము 'సారము' అని యర్ధము గలది. క్షీరములనుండి యెత్తిన సారమగు ఘృతమునకే తర్వాత నది