పుట:Telugu merugulu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగుమెఱుంగులు

11


హలంతత్వము దొలగిపోయి 'నెయ్యి', 'నెయి', 'నేయు', 'వై', 'నే' అను రూపములు వెలసినవి. 'సేయి' అను రూపమునకంటె నీరూపము లుచ్చారణ సుందరములు. తెలుఁగు బాస హలంతత్వము నేపగించును గాన 'నెయ్'ని అజంతముగాఁ జేసికొనుటలో 'ఇ' ని జేర్చు కొనఁగా 'నేయి' అయ్యెను. 'నెయ' పదము అజాది పదములు పరమయినపుడు 'నెయది' అనురూపము ఉచ్చారణసహము గాడు గాన, 'సన్ + అది = నన్నది', 'అన్ + అతఁడు = 'అన్నతఁడు' అను రూపము లందినట్లు, 'నెయ్యది' ఇత్యాది రూపముల నంది, అట్టి సంధినుండి పదచ్ఛేదముఁబడయుటలో 'నెయ్యి' అను రూపమును బొందెను. ఏకలఘుపూర్వకహల్మాత్రము గల శబ్దములు ఉచ్చారణ పుష్టి గలిగియుండవు గావున హలుచ్చారణబలము పూర్వహ్రస్వమునకుఁదన్ని దానిని గురువునుగాఁ జేసి యంతలోఁ దాను గరిఁగిపోవఁగా 'నే' అనురూపమేర్పడెను. ఆ కరఁగిన హల్మాత్రయకారము అజాదీ పదములు పరమగునపుడు వానితో గలసి యకారముగా నిలువ గల్గుచున్నది గాన దానిపై నజంతత్వపుఁ జికిలి జరగఁగా కొంత దుర్బలమయిన యుచ్చారముగల యకారముతో 'నేయు', 'నేయి' అను రూపము లేర్పడెను. హల్మాత్రమగు యకారము దుర్బలమగుటచేతనే 'నెయియ' అను రూప మేర్పడినట్లు 'నేయ్యి' అను రూపము పుట్టఁ జాలక పోయెను. 'నెయ్' లోని 'య్' 'ఇ' గా మాఱఁగా 'నై' అను రూపము పుట్టెను. పై రూపము లందు 'సాయి', 'నై' రూపము లర్వాచీనములు. ఇట్లు "నేయ్' శబ్దముపై నేర్పడిన బహు సుందరపరిణామములెల్ల మన తెలుఁగునఁ గలవు. 'చెయ్, వెయ్' మొదలగు శబ్దములుగూడ నిట్టిపరిణామములు బొందెను. శబ్దముల ప్రాచీన రూపములకుఁ దాఁతలనాఁటివన్న గౌరవ ముండగా నర్వాచీనరూపములకు హృద్య సంస్కారముల ననేకములఁ