పుట:Telugu merugulu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

తెలుగుమెఱుంగులు

10

తెలుఁగు; ద్రవిడకన్నడములు తెలుఁగుభాషాకస్య కందచందములు, పలుకుపొంకములు హెచ్చు. అఱవ పదములకును దత్ ప్రత్యయముకును, కర్ణాటపదములకును దత్ ప్రత్యయములకును సుచ్చారణమునఁ దోచు కార్కశ్యము నాఁటనాఁట దొలఁగి తొలఁగీ సవరనయినయుచ్చారణమును బడసిపడనీ తెలుగుపదములును, బ్రత్యయములును వెలసినవి. ఉచ్చారణ సుందరములయిన తెలుఁగుపలుకుల పూర్వ పూర్వపరిణామ క్రమదశలలో ద్రవిడకర్ణాటపద రూపములు రెండునుగాని, రెండింట నేదే నొక్కటి గాని పొందియుండుట పెక్కుచోట్లఁ గొననగును.


పై యుభయభాషాసంబంధము లేనివి యచ్చపుఁ దెలుఁగుఁ బలుకులు, ప్రత్యయములు గొన్నియున్నవి. ఇవీయేకాక, సంస్కృత ప్రాకృతోభయ భాషోచ్చారణ క్రమపరిణామముల బొందినవియు, ప్రాకృత మాత్రోచ్చారణ క్రమపరిణామములఁ బొందినవియుఁగూడఁ బెక్కుపలుకులు, ప్రత్యయములు తెలుఁగునఁ గలవు. ఇట్టివెల్లనుగూడి సుకు మారోచ్చార సంస్కారములను బడసిపడసి వానికంటె వైలక్షణ్యమును బొంది మన తెలుఁగు వెలుఁగొందు చున్నది. మీఁదఁ బేర్కొన్న విషయమున కుదాహరణముగా నొక పదమును బరిశోధించి చూపుదును. 'నూనె' ఈ పదము 'నూవు' 'నెయి' అను పదముల సమాసము. 'నూవులనెయి' అనగా 'నూవులసారము' అని అర్థము. ఇందు 'నూవు' అనుపదము ద్రవిడ కర్ణాట భాషల సంబంధ మేమాత్రమును లేని యచ్చపుఁ దెలుఁగుఁబలుకు. నూవులకు అఱవమునను, గన్నడమునను 'ఎళ్ అని పేరు. 'నెయ్' అను పదము ద్రవిడమునను, కర్ణాటకముననుగూడఁ గలదు. కానీ యది కర్ణాటకమున 'నే' 'నేయ్' ఇత్యాది రూపములఁగూడఁ బొందియున్నది. తెలుఁగున ఉచ్చారణ పరిణామములలో నసుందరమయిన