పుట:Telugu merugulu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

తెలుగుమెఱుంగులు


.

 "ఆతిధ్య గౌరవంబును,
స్వాతంత్ర్య ప్రియత, స్వల్పసంతోషము, దు
ర్నీతివిహీనత, నైచ్యా
పేతత్వము సంధ్రులందు పేర్పడు గుణముల్!!

ఓర్వరు మాయమర్శము సముజ్జ్వల ధీమహిమంబు పేర్పడన్
నెర్వరుగాక వీడియలు. నెయ్యము తియ్యము చూచుకోండ్రు. లో
గర్వము తక్కువే. యయిన గుండ్ర తలబునఁ గానవత్తు. రా
యుర్వపురుష్యులుల్ బలసమునకు లెన్న - నాంధ్రపుత్రకుల్. "


తెలుఁగువారీ స్వరూపస్వభాపములతో పాటు భాషా కవితా గాన రీతులలోని ప్రత్యేక లక్షణములు గూడ పేర్కొన్నదగినవి. తెలుఁగువారి శబ్ధోచ్చారము తక్కిన ద్రావిడుల యుచ్చారముకంటె సుందరమయినది. కనుకనే "తెలుఁగు తేట" అన్న నానుడి యేర్పడినది. తెలుఁగుదేశపు శీతోష్ణస్థితులు మంచి వగుటచే తెలుఁగువారి ముఖముద్ర స్పష్టవికాసము గలది. వారి ఆహారవిహారములు బలిష్ఠములగుటచే దృఢగంభీరరీతులుగలది వారి యుచ్చారము. వేదోచ్చారమున నాంధ్రద్రవిడులే భారతదేశమంతటి కిని బ్రఖ్యాతి గన్నవారు. తెలుఁగు భాష కున్నన్ని యక్షరములు తక్కిన యే ద్రవిడ భాషకుఁగాని లేవు. తెలుఁగుపలుకులు ప్రాయికముగా ఆజంతము లగుటచే ప్రతిపదము విభిన్నముగా వ్యవహరింప వీలగును. ద్రుతపుచ్ఛము కొన్నిపదముల కుండుటచే నది తర్వాతి యజాదిపదములతో సుఖ సంధ్యుచ్చారము గూర్చునదై హృద్యత గొల్పుచున్నది. గసడదవాదేశము, సరళాదేశము శబ్దముల కటూచ్చారమును దొలఁగించుచున్నవి. ద్రవిడ పదముల యచ్చమెత్తదనముగాని, సంస్కృతపదముల ప్రొడగాఢ క్లిష్ట