పుట:Telugu merugulu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగుమెఱుంగులు

5


వాక్సరములుగా లేక, యరవమెత్తదనమును, సంస్కృతపు బింకముసు కొంతకొంత కూర్చుకొని, దేశీతత్సమతద్భవపద పౌష్కుల్యముతో తెలుఁగుబాస ద్రావిడభాషా కుటుంబములో లేఁబ్రాయపు జిలిబిలి పలుకుల పొలఁతియై వన్నె కెక్కినది. ఇటువంటి భాషాపరికరముగల తెలుఁగువారి కవితయు కొంతవిశిష్ట లక్షణములు గలది తెలుగుకవిత ప్రాయికముగా సంస్కృతా సుకారియేయైనను నందులో నెంతో విశిష్టతకూడ కలదు. నన్నయ, తిక్కన, ఎఱ్ఱన యను కవిత్రయము గోదావరి, కృష్ణ, పినాకిని యసు నదీత్రయమువోలె తెలుఁగువారికి జీవనాధార మలునది గోదావర్యాదినదీత్రయము శాఖోపశాఖలతో కాల్వలై పాయలై పాటి తెలుఁగునేలనెల్ల పాడిపంటలతో సుక్షేత్రపఱిచినట్లు, కవిత్రయకవిత శ్రీనాధ పోతనాది సర్వాంధ్ర కవిపరంపర యొక్కయు హృదయ క్షేత్రములందు రసధార పాటించి దివ్య కావ్య సస్యములను పండించినది. నేఁటి నవకవిహృదయ క్షేత్రములందును పాఱుచు పండించుచున్నది. కవిత్రయమువారు దైవభక్తులు, సదాచారులు, ఉత్తమపండితులు, వారి రచనలలో జుగుప్పితము, నీతిదూరము నగు కూర్పు తీరు కానరాదు. వారి దివ్యకావ్యసృష్టి సర్వాంధ్రకవి మండలికిని మేలు జలతియై సత్కావ్యసంప్రదాయము కొనసాగించుచున్నది. నన్నయ ధర్మోపాఖ్యానములు. సన్నిచోడని దేసిమఱుగులతెలుఁగులు, తిక్కన మర్మకవితలు, ఎఱ్ఱనకృష్ణబాలక్రీడాది వర్ణన సౌభాగ్యములు, పోతన భక్తికచీతామృతధారలు, శ్రీనాధునియాంధ్రదేశశివసౌందర్యవర్ణన, శయ్యా సౌభాగ్యకల్పనాహ్లాదములు. పెద్దనతిష్మునల మనోజ్ఞ ప్రబంధసృష్టులు, సూరన రామకృష్ణుల శాలీన నిగమశర్మాది కధాకల్పనా విశేషములు, సోము రంగనాధ గౌరనల ద్విపడరచనా సారస్యములు, సుమతి భాస్కర వేణుగోపాలాది శతక కవితా చమత్కారములు, వేమున్న వినోదవిమర్శపు