పుట:Telugu merugulu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

157


మఱియు నా మార్పులు సులువుగా జరపఁదగినవై యండవలెను గాని మూలచ్ఛేదులుగాను, సర్వము తార్మారుపఱుచునవిగాను, అమితవ్యయా పాదులుగాను, జనసామాన్యమునకు ఆరంభముననేని ఉక్కిరిబిక్కిరిగా అర్ధముగానివిగా నుండునవిగాను. "గారాదు. అట్టివానివలన అలజడి. అశాంతి యేర్పడును. నేఁటి తెలుఁగక్షరములనే తీసివేసి దానికి బదులు ఇంగ్లీషక్షరములనో, నాగరాక్షరములనో పెట్టుద మనువారు కొందఱు గలరు. ఈ సూచన లనర్ధదాయకములు. ఆ మార్పులు సులువైనవిగాపు. ముత్తెపుసరులను జాచి పట్టినట్టు తెలుఁగు వ్రాంతబంతులు గుండ్రని వ్రాలు గలవై యందముగా నుండును. ఇది మన లిపి కున్న యున్నతసుగుణము. దీనిని గోల్పోరాదు. ఇంగ్లీషు నాగరలిపుల కీ యందము లేదు. మఱియు చేసిన సంస్కారము, ఇప్పుడున్న లిపికి అలవాటు పడియున్నవారి కెల్లరీకి క్షణములో గుర్తింపఁదగినదై, యనుసరింపఁదగినదై యుండవలెను. అది వ్రాతలో, అచ్చులో, టైపులో మూఁడిటను భేదము లేక ఒకే తీరుగా నుండవలెను. వ్రాఁతలిపి వేఱు, అచ్చులిపి వేఱు, టైపులిపి వేటు అన్న ట్లుండరాదు. మహారాష్ట్ర గుర్జర దేశములందు నాగరిలిపి కిట్టి చిక్కు గలదు. అందు వ్రాత మోడిలిపి వేఱు. అచ్చులిపి వేఱు. అట్టి విభేదము మనకుఁ గల్గరాదు.

సంస్కార విధానము

మీఁద వివరించిన దోషము లెల్లఁ దొలఁగునట్లును, గుణములెల్ల గూడియుండునట్లును గుదిరియున్న దని నేను విశ్వసించిన సంస్కార విధానము నిక్కడ చూపుచున్నాఁడను.