పుట:Telugu merugulu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

తెలుఁగుమెఱుంగులు


అచ్చులు:

అచ్చులలో అకార మొక్కటి తక్కం, దక్కిన యక్షరముల నెల్ల విడిచి పెట్టవలెను. అ కారముమీఁదనే దీర్ఘము, గుడి మొదలగు అజ్ఞుణిత చిహ్నములను (చిత్రము చూచునది) జేర్చినచో అచ్చులెల్ల నేర్పడును. అకారమును మాత్రమట్లే యుంచునది. హల్లుల మీఁద నీ ------- అకారము తలకట్టు రూపమును బొందును. ఆకారాది స్వరములు హల్లుల మీఁద నున్నప్పుడే గుణితము లగునుగాని అకారముమీఁద నున్నప్పుడు గావు - అచ్చులకు గుణితము లేదుగాన.

అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ,ఋ,ౠ, 7, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ అను విధములఁ గల బదునాఱులిపులకును చిహ్నముల నుంచవలెను. (చిత్రము చూచునది.)

ఇట్లు మార్పఁగా బాలురకు ఒక్క అకారము మాత్రము నేర్పి, తర్వాత దీర్ఘము గుడి మొదలగు అజ్ఞుణితపు చిహ్నముల నేర్పినచో నచ్చు లెల్ల వచ్చును. కకారాదుల మీఁద నిఁక వేఱుగా అజ్ఞుణితమును నేర్పఁ బనియుండదు. ఒక్క తలకట్టు మాత్రమే నేర్పవలసియుండును. దీర్ఘము, గుడి మొదలగు నజ్ గుణితవు చిహ్నములు అచ్చులలో నేర్పుటచే నా చిహ్నములే హల్లులపై నుండును. కావున పదునైదు భిన్నాక్షరముల నేర్చుకోవలసిన బాధ తగ్గింది. ముద్రణమునఁ గూడ అచ్చులలో పదునైడు చిహ్నములు తగ్గిపోయునవి.