పుట:Telugu merugulu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

తెలుఁగుమెఱుంగులు


-3. టైపురైటింగు..


అచ్చునకే యిన్నిచిక్కులుండఁగా నింక టైపు రైటింగు కుదరునా? ఇంగ్లీషున, ఆజవమున ఉన్నట్లు లిపి సంకేతములు ప్రక్కప్రక్కనే (ఒక దాని క్రింద నొకటి యుండకుండ) యుండుట, ఆ సంకేతములుగూడ నలువదింటికంటే మించకుండుట ఉన్నఁగానీ టైపు రైటింగు సాధ్యము గాదు, కాన ఇప్పటి లిపిరీతికి టైపురైటింగు కుదురనే కుదురదు.


4.సంస్కార మెట్లుండవలయును?


మీఁద వివరింపఁబడినచిక్కులెల్లఁ దొలఁగునట్లు, అనఁగా బాలురకు సులభముగా నేర్పఁదగియుండునట్లు అది విస్పష్టముగా నౌక నిర్మాణ విధానముతో నుండునట్లు, ఉచ్చారణరీతికి భిన్నము గాకుండునట్టు, అచ్చులో సౌకర్యమేర్పడునట్లు, టైఫురైటింగుకుఁ గుదురునట్లు సంస్కరించుట సాధ్యమేని యది యవశ్యకర్తవ్యము గాదా? తాతలు త్రవ్విన నూయిగదా యని యందుండి యుప్పునీటినే యెప్పుడును ద్రాగుచుండఁదగునా - దగ్గఱనే మంచినీటి బావి త్రవ్వఁదగియుండెనేని? అదిగాక, నేఁటి లిపిరీతి మాత్రమే మంతనిశ్చలము? అయిదువందల యేండ్ల పూర్వమునఁ గల లిపికిని, మననాటి లిపికిని నెంతేని భేదము గలదు. నేఁటిలిపికూడ బహు పరిణామములఁబొందుచు వచ్చుచున్నదే.

లిపిలో నిప్పుడున్న కీళ్లను దొలఁగించుకొనుట ఆశ్యకమే కాని, వానిఁ దొలఁగించుకొనుటకై చేయు మార్పులలో నున్న మేళ్లుగూడ- గొన్ని యూడుట యగునేని యా విధాన మంగీకారార్ధము గాఁగూడదు.