పుట:Telugu merugulu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

155


అఱవలిపి సంకేతముల సంఖ్య మిక్కిలి తక్కువగా నుండుటే. అందు 246 మాత్రమే లిపి సంకేతములు. క్రొత్తగా కంపోజిటర్లు తెలుఁ గచ్చుకూర్పును నేర్చుకొనుట కాఱునెలలు పట్టును. అఱవపుటచ్చుకూర్పు ఒకనెలలో నేర్చుకోవచ్చును. 500 గళ్లలోనుండి సంకేతముల నేర్చవలసియుండుటచే తెలుఁగులిపిని గూర్చుటలోఁగూడఁ జాల జాగగును. గంటకు ఒక 'గాలీ' అఱవము కూర్పఁగలుగఁగా, తెలుఁగున 'అఱగాలీ' మాత్రమే కూర్చఁ గలుగుదురు. ఇట్టికారణములచే తెలుఁగు కంపోజిటర్లు విరివిగా దొరకరు. తక్కిన భాషలకంపోజిటర్లకంటె వీరికి జీతము హెచ్చు, ఇదిగాక అచ్చు కూర్పులో సౌందర్యము తక్కువ. ఒత్తక్షరమున 2,4, 3 లిపి చిహ్నములు ఒకదానిక్రింద నొకటిగాఁ జేర్పవలసియుండుటచే బంతులు తీర్చినట్లు సాగవు. 'వాక్స్వాతంత్ర్యము' అక్షరము క్రింద నక్షరముఁ జేర్పవలసి యుండుటచే 'ఫుల్ బాడీ', 'ఆఫ్ బాడీ', యను భేదములతో వేఱుతీరుల యక్షరముల నెక్కువగాఁ బోఁత పోయవలయును. 500 లిపి సంకేతములను నిర్మింపవలసియుండుటచే వ్రాతమోడి, పరిమాణము భిన్న భిన్నములుగా నుండునట్లు అనేక విధములగు లిపి భేదములను గల్పింప సాధ్యపడకున్నది. (మాటవరసకు) మద్రాసులో అఱవమున డెమ్మీఫారము ముద్రణమునకు నాలుగురూపాయలు ఛార్జి చేయఁగా, తెలుఁగున నదేమాదిరి ఫారమునకు ఆఱు, ఎన్మిది రూపాయలు చార్జి చేయుచున్నారు. ఇట్టి వింకనెన్నో చిక్కులు తెలుఁగు ముద్రణవిధానమునఁ గలవు. ఇంతకుముందు మొదటి ప్రకరణమునఁ జెప్పిన వ్రాతచిక్కు లెల్ల నీ ముద్రణమునకును గలవు.