పుట:Telugu merugulu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

149

తెలుఁగుమెఱుంగులు


కాఁగా, ఎఱిఁగయో, యెఱుఁగకయో యెటుపోయినను ఘట్టకుటీ ప్రభాతన్యాయమున సర్వమానవగతియు, అంతే యేమి - సర్వప్రాణిగతియు నీశ్వరాభిముఖమే యగుచున్నది. కాస ఈశ్వరప్రాప్తి ప్రాణికోటి కెల్ల సనివార్యమేకదా !

సదసత్తులతో, జ్ఞానాజ్ఞానములతో, ఆనందదుఃఖములతో, అపాయ, తన్ని వృత్తులతో కలగలు పయి గజిబిజిగా నున్న ప్రపంచవృత్తిలో తా ముపద్రష్టలై లోకసామాన్యమున కీయీశ్వరప్రాప్తియత్నమున తాత్త్వికులు, శాస్త్రకారులు, చిత్రకారులు, కవులు పురోగాములై యుందురు.

తాత్త్వికులు, శాస్త్రకారులు ఘోరదీక్షతో నంతరంగసముద్రమును మథించియు, బాహ్యమాయావరణారణ్యమును జీల్చికొని బాటలు తొక్కియు గుర్తించి, తెచ్చిన దివ్యవిజ్ఞానపదార్ధములను పరికరములుగా ల గొనియే వారివెనుక నడచువాఁ డగుకవీశ్వరుఁడు వానిలో మే లేర్చి వారు గుర్తించిన మార్గములలోనే చలువ పందిళులను, రసామృతప్రపలను గల్పించుచు, నింకను వెనుక నడచు మానవ సామాన్యమునకు వేడుగొల్పుచు వారీపయనము సుఖమయము గావించును,

తాత్త్వికునిలోఁ బరమార్థసాక్షాత్కార ముండును. కవిలోఁ దదనుసారిగా ప్రసన్నమధురాంశచ్ఛాయాకల్పనము లుండును.

తాత్త్వికునిలో కవితాంశములుసు, కవిలో తాత్త్విక తాంశములును గూడ ననుగతములై యుండువచ్చును.

తాత్త్వికుల తత్త్వజ్ఞానము పెరుగఁగా పెరుగఁగా తన్మూలమున కవితలో తాత్త్వికతాంశములు పెరుగఁగా పెరుగఁగా సంఘమున తాత్త్విక తాశ్రద్ధ పెచ్చుపెరుగును. అప్పుడు కవిత తేటదేరి క్రమపరిణామముతోఁ బరమార్థపరాయణ మగును. కృత్రిమకవితావిడంబనముల కపుడు తావుండదు. కవి కపుడు సత్యప్రతికృతికల్పన మనావశ్యక మగును. సౌందర్యసముచిత మయిన ఆ పరమార్థమే, అనఁగా సత్యమే యప్పుడు