పుట:Telugu merugulu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

తెలుఁగుమెఱుంగులు


నిర్వచించుటకో, నిరూపించుటకో పూనినపుడు దాని చిద్విలాస మిఁక నెంతేని వింత గొల్పునదై యుండి తీఱును గదా. క్రాంతదర్శియైన సుకవి తనలో దృశ్యాదృశ్యముగా వెలుంగులు గొలుపుచున్న తత్త్వమును వ్యక్తావ్యక్త వాక్కులతో వ్యంగ్యమర్యాదతోనే సామాజికులకు పరిస్ఫురింప జేయవలసినవాఁ డగును, ఉత్తమగాయకుఁడుగూడ నొక్కోకపు డంతరంగమున గానామృతము పొర్లు వాలుచుండఁగా నుచ్చస్థాయికి భోయిపోయి, కంఠశక్తి వెనుబడఁగా శిరః కంపహస్తవాలనభ్రూభంగా దులచే గేయావశేషము నవగతపబుచువాఁ డగును,


కవి తనలో నెక్కడో యనభివ్యక్తముగా నెప్పుడో గోచరించిన పరతత్త్వము నాలంబముగాఁగొని దాని యనుభూతివాసనచొప్పునఁ దన నేర్పుకోలఁదీ భాషతో నొకప్రతికృతిని గల్పించి, సామాజికులకు దానిని బ్రదర్శించి పరమార్థానందచ్ఛాయ ననుభవింపఁజేయును. కవీశ్వరునట్లు సామాన్యజనుఁ డట్లు దాని దర్శింపనేని, ప్రదర్శింపనే చాలఁడు. అట్లే చిత్రకారుఁడును తన కేక్కడో-లోపలనో వెలుపలనో గోచరించిన దృశ్యమును దేశకాలాంతరములందు తనభావవాసనాసంస్కారమువలనఁ గొనివచ్చి తననేర్పున కనుగుణముగా వన్నెచిన్నెలతో రూపు గల్పించి, చూపి సామాజికుల నానందపఱచును.

ప్రకృతిపుష్పము వెలార్చుసౌందర్యసౌరభ్యాదులు చిత్ర పుష్పమున లేవు. అయినను సామాన్యమానవులీ చిత్రకారుని పుష్పము నధికానందముతో నాలోకింతురు. ప్రతికృతికంటే సాక్షాత్సత్య వస్తు వధికహృద్యము వలయుట విస్పష్ట విషయమే కాన, చిత్రపుష్పముకంటె మూలపుష్ప మధిక హృద్యమే కావలెను గదా? అయినను మూలపుష్పమున నెప్పుడో యెక్కడో కొంతసేపే దృశ్య మగుట, దాని రచయితయు, రచనా ప్రణాళియు నదృశ్యములగుట యన్న కొలుత లుండుట వలనను, చిత్రపుష్పమున సదా సర్వత్ర దృశ్య