పుట:Telugu merugulu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


14

కవితాపారమ్యము


శ్రీవేంకటపార్వతీశ్వరకవుల 'యేకాంతసేవను, దాని యనుకార్యమగు 'గీతాంజలి' ని బురస్కరించుకొని 'కవితాపారమ్య' మనువిషయమును గూర్చి నేను తలపోయుచుండు విషయముల నిక్కడ నించుక ప్రస్తావింతును.


శ్రీ వేంకటపార్వతీశ్వరకవులు రచియించిన యేకాంత సేవాకావ్యము రవీంద్రనాథ టాగూరుగారి 'గీతాంజలీ' చ్ఛాయగలదిగా విఖ్యాతి గాంచినది, 'గీతాంజలి' యు, 'నేకాంతసేవ' యు వ్యంగప్రధానకావ్యము లనియు, అవాజ్మానసగోచరమైన యీశ్వరతత్వమునుగూర్చి యన్వేషము జరుపువారి నవి యొకానొక యవ్యక్తానుభూతికిఁ దారఁగలిగియున్న వనియు వాకొనుట సహృదయులకు ననుభవపునరుక్తి.

వ్యంగ్యప్రధాన మైనకావ్య ముత్తమకావ్య మని యాలంకారికుల నిశ్చితనిర్వచనము. విరిసినపూవు సువాసనను, పుప్పొడిని, మకరంద బిందువులను తననెలవునకుఁ బై పడి యివీ యింతవరకే యని గీటుగీయ నలవికానంత వింతగా చుట్టుపట్టుల కెంతదాఁకనో ప్రసరింపఁజేసి వేడుక గొల్పినట్లు, వ్యంగ్యవైభవముగూడ నిది యింతే యని గ్రుద్ధి హద్దుగీటు గీయరానంతవింతగా వాచ్య లక్ష్యములకంటె మించిన యుద్ధవిశేషముల నెన్నింటి నేని జలజల రాల్చుచు నానందము గొల్పును. వ్యంగ్య వైభవము వాచ్యాతిశాయి గనుక వాచ్యమున నిర్వహింపఁదగనివియుఁ, దరము గానివియు నగుసర్ధముల ననుమితపఱచు నది సామాజికులను విశాల యోచనమునకుఁ బాల్పబచి యనిర్వచనీయానందమునకుఁ దార్చును.


లోకానుభూయమానములగు సామాన్యవిషయములలోనే వ్యంగ్యవైభవ మింతచమత్కార జనక మగు సనఁగా, నిఁక నవాజ్మనస గోచరము, సర్వజగద్వ్యాపారమూలాధారము నగు నీశ్వరతత్త్వమును