పుట:Telugu merugulu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

తెలుఁగుమెఱుఁగులు


సంస్కృత వాల్మీకి రామాయణమునకును, ప్రాచీనాంధ్రరచనములగు రంగనాథభాస్కరరామాయణములకును జాల భేదములు గలవు. రంగనాథభాస్కరరామాయణలుగూడఁ గొన్ని కాండములందుఁ బోలికలు గలిగి, కొన్ని కాండములందు లేక యున్నవి. రంగనాథ రామాయణమున విశిష్టాద్వైత విషయములు గొన్ని యధికముగాఁ జేరినవి.కొన్నికథాభేదము లున్నవి; అధికకథ లున్నవి. అందుఁ గొన్నిటికి సంస్కృతమూలము గానరాదు. దేశికథా సంప్రదాయముల ననుసరించి వానిని కవిచేర్చియుండ వచ్చును. ఎర్రాపెగ్గడ రామాయణాంద్రీకరణము హరివంశాంద్రీ కరణమును బోలియుండు ననఁదగును. ఇప్పు డుపలబ్ధము లయిన పద్యములు సంస్కృతాను సారులుగా నున్నవి. ఆయా పర్యముల పట్టులను సంస్కృత వాల్మీకి రచనలతోసు, తెలుఁగు రంగనాథ రచనాభాగములతోసు బోల్చి చూచిన నీయెర్రా ప్రెగ్గడ పద్యములు సరిగా సంస్కృతానుసారులుగా నుండుట వ్యక్త మగును.


రంగనాథ భాస్కరరామాయణములు ఎర్రాప్రెగ్గడ రచనమున కంటెఁ బూర్వము వెలసిన వనందగినవి. ఎర్రాపెగ్గడ కించుక తర్వాతికాలమువాఁ డగును - భాస్కరరామాయణ యుద్ధ కాండశేషమును పూర్తిచేసిన అయ్యలార్యుఁడు. ఇంచుమించుగ నాతని కాలముననే తెలుఁ గున మఱొక రామాయణాంద్రీరణము వెలసినది.

రామాయణకృతి కృతియై. ఆ మెఱయుచు నాంధ్రకవిపితామహుఁడనఁగా
భూమిం చినభీమన యను-నామంబున వెలసె సత్యనారనఘనుఁడై,

(సింహాసనద్వాత్రింశిక,)

'పిన భీమన', యని 'ఆంధ్రకవిపితామహుఁ' డని పేరందిన. రామాయణకృతికర్తయైన యీ సత్యనారస అనపోతకుమారసింగభూపతి (వెలుగోటి వెలమరాజు) సమకాలమువాఁ డగును. ఈ రామాయణము