పుట:Telugu merugulu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగుమెఱుంగులు

141


ఆ నెఱజోదు కేలుచొనఁకై నిగుడించుట యమ్ము మౌర్వి సం
ధాసము సేత నిండఁదెగఁ దార్కోనీ లక్ష్యము సేయు డేయుడున్,
గాన సజస్రమండలితకార్ముక మొక్కటి గంటిఁ గంటి న
ద్దాసదీర్ఘ దేహసముదాయనిరంతర పాదవేగముల్.

స్రగ్దర.
కరిణీయానంబు నవ్వున్ గతి నవలతికాకార మంగంబు చంద్రున్
బురుణించున్ ముద్దుమో మంబురుహదళములంబోలుఁ గన్ను ల్విపంచీ
స్వరసంకాశంబు పల్కున్ జలదళినిచయస్పర్థియైయుందు వేణీ
భర మాతన్వంగి కింద్రప్రముఖ నిఖిల దిక్పాల కాథీలశౌర్యా,

చ.అలినిభవేణి చంద్రసద్మశాసన యుత్పలపత్రనేత్ర కో
మలలతికాభిరామభుజ మంజులవృత్తలసత్కుచడ్పడూ
కలితసుమధ్య హృద్యకటి కామ్యతరోరువు రమ్యజంఘ యు
జ్వలచరణాబ్జ తద్వనిత జానకినా, విలసిల్లు రావణా. "

వా రిందుకై మదరాసులోని యితర తాళపత్రప్రతుల నెల్లం బరిశీలించిరట! ఆ విషయము నిట్లు చీటిలో వ్రాసి పంపిరి : "ఈ పద్యాలు నేను అనెగొందినుంచి తెచ్చిన ప్రతిలోనివి. అందు 'ఎర్రాప్రగడ పద్యాలు' అను శీర్షికతో గూడియున్నది. ఇది గాక అడయారు లైబ్రరి G.NO. XXXII T. 13 G. 'యెర్రప్రగడ వారి పద్యం (తాళ, ప. 86, పం.1) అనుమాటకు తరువాత పై మూడు పద్యాలు కలవు. ఇంకను మద్రాసు యూనివర్సిటీ కలెక్షన్ (ఎర్రాప్రెగ్గడ పేరులేకున్నను) 1/150 నంబరు ప్రతియందు మూడుపద్యములును గానవచ్చుచున్నవి. అట్లే 1/426 లో కూడా పద్యాలు పేరులేకుండా కొన్పించుచున్నవి. G.Or. Mss. Madras. 14-10-7 దీనిలో ఎర్రాప్రెగ్గడ పద్యాలు' అన్న మాటలేదు. కానీ ఆ పద్యాలలో "కరిణీయానంబు", "అలినిభ వేణి" అన్న పద్యాలు కాన్పించుచున్నవి."

ఈ మూఁడుపద్యములతో పాటు తక్కిన అరణ్యకాండరచనాభేదము లెల్లఁగూడ ఎర్రాప్రెగ్గడ రచనములు కావచ్చునేమో యనికూడ నే ననుమానించు చున్నాను.