పుట:Telugu merugulu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

తెలుఁగుమెఱుఁగులు


అరణ్యకాండమున ముద్రణములంు ప్రధనపాఠముగ గ్రహింపఁ బడిన గ్రంథ భాగములు తాళపత్రప్రతులలో సాధారణముగా దొరకుచున్నవియు, పాఠాంతరముగా నధఃకరింపఁబడినవియు నగు గ్రంథభాగములకంటెఁ బ్రశస్తరచనము కలవి. ఒకవేళ నవియెల్ల ఎఱప్రెగ్గడ రచనమేమో యని యొక పెద్ద సందేహము నాకుఁ గలిగెను. ఆ గ్రంథభాగములలో వాల్మీకిరామాయణానుసారులు కానివి కొన్ని రచనములు కలవు.

చ.“తపనుఁడు వేఁపఁజొచ్చె ననుఁ దమ్ముఁడ! వృక్షముక్రిందఁ బెట్టు:నా
దపనుఁడు రేయి లేఁడు వసుధావర! చంద్రుఁడుగానిః చంద్రునిన్
నృపసుత! యె ట్లెఱింగితివి నీవు; మృగాంకము చూడనునీ హా
చపలమృగాక్షి! చంద్రముఖ ! జానకి! యెక్కడ నున్న దానవే"?

"సౌమిత్రే, నను సేవ్యతాం తరుతలం చండాంశు రుజ్జృంభతే
చండాంశో ర్నిశి కా కథా రఘుపతే, చంద్రోఽయ మున్మీలతీ.
వతైత ద్విదితం కథన్ను భవతా ధత్తే కురంగం యతః
క్వాసి ప్రేయసి, హా కురంగనయనే, చంద్రాననే, జానికి "

(ప్రసన్న రాఘవము)

ఇత్యాదులు.

ఇట్టి యీప్రధాన పాఠరచనముకూడ ప్రాచీనకవికృతమే కావలెను. కాని, యిది భాస్కరరామాయణ మను పేర లభ్యమగుచున్న గ్రంథములోనిది కాదు-- భాస్కరరామాయణతాళపత్రప్రతులలోఁ గానరాదు కాన. ఇట్టి సందేహములతో నేను చీకాకుపడుచుండఁగా డాక్టరు నేలటూరిగాకట రమణయ్య గారు తమ కానెగొందిలో నొక భాస్కరరామాయణపుఁ దాళపత్ర ప్రతి దొరకె ననియు, అం దారణ్యకాండమున ఎఱాప్రెగ్గడ కృతములుగా కొన్ని పద్యములు గానవచ్చె సనియు తెలిపి ఈ క్రిందిపద్యములను నాకుఁ జూపిరి: