పుట:Telugu merugulu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

తెలుగుమెరుంగులు

ఇప్పుడు సుముద్రితమై వెలసియున్న భాస్కర రామాయణమునఁ గూడ ఎజ్జాప్రెగ్గడరామాయణముపద్యము లనేకములు చేరియున్నట్లు తెలియవచ్చుచున్నది. పెక్కేండ్లకు పూర్వము మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమున తెలుఁగుగ్రంథములకు డిస్క్రిప్టివ్ క్యాటలాగు (Descriptive Catalogue) వ్రాయునపుడు భాస్కరరామాయణమును సామాన్యదృష్టిని పరిశీలింపఁగా పాఠభేదములు , గ్రంథభేదములు చాలఁ గాఁ గానవచ్చినది. ఆ విషయమప్పు డందు వెల్లడించితిని. ఆనందముద్ర ణాలయమువారి భాస్కరరామాయణముద్రణములకు వారియొద్ద పండితులుగా నుండిన కీ. శే. తంజనగరం తేవప్పెరుమాళ్లయ్య గారు ఆరణ్యకాండముల రెండు భిన్నరచనము లుండుటనుగూర్చి కొంత నాతో జర్చించిరి. భాస్కరరామాయణము నందలియారణ్యకాండమున ప్రధాన పాఠముగా గ్రహింపఁబడిన పద్యములనేకములు ఏతాళపత్ర ప్రతిలోనుగాన రాకుండెను. పాఠాంతరములుగా పుటల యడుగున చిన్న టైపుతో ముద్రింపబడిన పాఠములే తాళపత్రప్రతులలో నున్నవి. తొలుదొలుత భాస్కరరామా యణమును ముద్రించిన వారు కరాలపాటి రంగయ్యగారో, నిశ్చింత తేవప్పెరుమాళ్లయ్యగారో యని మే మప్పుడు గుర్తించితివి. వా రేప్రతులను చూచి అట్లు ముద్రించిరో యెఱుంగరాదు. కరా సాటి రంగయ్యగారు గొప్పకవి. ఆయన కొన్ని ప్రౌఢగ్రంథములను రచించెను. ఆరణ్యకాండమున ప్రధానపాఠముగా గ్రహించిన పద్యముల నాతఁడు రచించి చేర్చినేమో యనికూడ మేమప్పు డనుకొంటిమి- తాళ పత్రప్రతులలో నా పద్యములు కానరాలేదు గాన.