పుట:Telugu merugulu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱంగులు

137


కూచిమంచి తిమ్మకవిగాక మణికొందఱు లాక్షణికులును ఎట్టి పెగ్గడరామాయణములోని పద్యములను తమలక్షణ గ్రంథములం దుదాహరించినారు. అట్టివి మఱికొన్ని యీ క్రిందివి:

గణపవరపు వేంకటకవి ప్రయోగరత్నాకరము--

క.ధాత్ర... సురసేవారతి -భ్రాతృభృతి గురూ క్తిపాలబంధురమతి దు
శ్యాత్రవహరణచణస్థితి మిత్రానందకరవిహృతి మీయం దమరున్.

సీ. బాలసుధాంశునిటాలుని నవసుధాలాపముల్ వినవలె ననెడు. నాస..

క. ఆదశరథసూనుండు ష-యోధిజలం బీంక నేసి యొకశరమునఁ గ్ర
వ్యాదవిభుఁ దునీమీ సీతను-మోదంబునఁజేకొని కపిపుంగవుతోదన్."

(ఎల్జాప్రెగ్గడ సంక్షేప్తరామాయణము)

గణపవరపువేంకటకవి ఎఱ్ఱా పెగ్గడసంక్షేపరామాయణము లోనివిగా సుదాహరించిన పద్యములు ప్రశస్తరచనముకలవి కావు, అతడు ప్రబంధరత్నాకరమున కొన్ని లక్షణములను గల్పించి వానికి లక్ష్యపద్యములను ప్రసిద్ధకవుల గ్రంథములలోనివి గాఁ గొన్నింటిఁ గల్పించి యుదాహరించిన ట్లున్నాఁడు. ఈతఁ డుదాహరించిన ఎఱ్ఱా ప్రెగ్గడ రామాయణ పద్యములు కల్పితము లైనను గావచ్చును; లేక, ఎఱ్ఱాప్రెగ్గడరామాయణములో గ్రంథారంభభాగ మగుసంక్షేపరామాయణము లోని వయినను కావచ్చును. అంతేకాని ఎఱ్ఱా ప్రెగ్గడ సంక్షేపరామాయణ మని వేరొక గ్రంథమును రచియించియుండఁ డనుకొందును. ఎఱ్ఱా ప్రెగ్గడ తనతండ్రి సంస్కృతమున సంక్షేపరామాయణ మొకటి యముద్రితము కలదు. ఆ సూర్యసుకవి మన మెట్ర ప్రెగ్గడతండ్రి యగునేమో! ఆ సంస్కృత సంక్షేపరామాయణమును, ఎఱ్ఱా ప్రెగ్గడ సంక్షేపరామాయణమునకు సంబంధ మేమైనఁ గలదేమో- ఎఱ్ఱాప్రెగ్గడ రామాయణము దొరకినప్పుడు తెలియవలెను.

తెలుఁగుమింగులు 137 w