పుట:Telugu merugulu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

తెలుఁగుమెఱంగులు

136

మ.చెఱకుందోఁటలఁ బెంచి శాలిమయ సుక్షేత్రస్ధలుల్ నించి య
క్కలు లేకుండఁగఁ బూగనాగలతికా కాంతారముల్ ప్రోడి యే
డేలు నంతం గుముదోత్పలాళీవనవాటికోటిఁ బాటించి పె
వేణువుల్ వాల్చెఁ బురంబునర్వ్సలఁ బ్రస్ఫీతంబుపూర్ణస్థితిన్."


కూచిమంచి తిమ్మకవి గోదావరిమండలమున పిఠాపురమునకు చేరువను కందరాడ, చంద్రమపాలెము అను గ్రామముల వసించెను. ఈ గ్రంథమును క్రీ.శ. 1750 సంవత్సరప్రాంతమున రచించెను. 'అతఁ డుదాహరించిన యెర్రా ప్రెగ్గడరామాయణపద్యములు ఇతర లక్షణ గ్రంథముల నుండి సేకరింపఁబడినవి కావు. అతఁడు స్వయము గ్రంథమును బరిశీలించి యుద్ధరించినవే. ఇన్ని పద్యముల నితరలాక్షణికు లెవరు నూహరింపలేడు. ఇప్పటికి సుమారు 190 ఏండ్లనాఁడు గోదావరి మండలమున, కూచిమంచి తిమ్మకవియింట ఎట్టా ప్రెగ్గడరామాయణము సురక్షితమై యుండె నని దీనివలనఁ దెలియఁగలదు. చదలవాడ యెఱ్ఱా ప్రెగ్గడరచనముగా నీకవిస్తుతి పద్య మొకప్రాచీన పద్యసంకలనమునఁ గానవచ్చినది.

 శా.“సారోదార సమంచిత స్ఫుర దురు స్ఫాయల్లసల్లాలిత
(స్ఫారంబుల్ వె?) సఁ ద్రిష్టి పెట్టుచును శబ్ధద్రవ్యహీనుల్ సదా
తారుం జెప్పితి మంచుఁ జెప్పికొనుటల్ తప్పే నిరాఘాటవా
క్సౌరభ్యప్రతీ భావిజృంభితులు మెచ్చర్ గాక దూచందముల్..

ఇది యర్రా ప్రెగ్గడ రామాయణకృత్యవతరణిక లోనిది గావలెను. ఈ క్రిందిపద్యమును 'ఎఱ్ఱనరామాయణములోనిదా?' అని యెప్పుడో నోటుబుక్కులో వ్రాసికొంటిని. ఎక్కడనుండి యుద్ధరించితినో యిప్పుడు గుర్తింపఁజాలను.

 ఉ.“చువ్వన మేను వంచి రవి సోఁకఁగఁ దాఁక విదల్చిపాదముల్
వివ్వఁగఁ బట్టి బాహువులు వీచి మొగంటు బిగించి కొండ జై
జవ్వన నూఁగి ముందటికిఁ జాఁగి వీటిందికిఁ దూఁగి వాపై
ఉవ్వన దాఁటె వాయుజుఁడు తెక్కలలోడి సురాద్రియో యనన్."