పుట:Telugu merugulu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుఁగులు

131



ప్రాతిపదికము లయినవి. ఇట్లగుట సంగతమే. ఇట్లు అవన్, మగన్,రామస్ అనియున్న ప్రాతిపదికములకు బహువచన ప్రత్యయమగు 'ఱు' (ఇది బండి ఱ గా ప్రాచీన శాసనలిపి గలదు} పరము కాఁగా అవను, మగను, రామన్దు అను రూపము లేర్పడవలసి యుండెను. కాని యేకపదమున 'న' కార ఱ' కారములకు సంయుక్తత అలవముననే కాని తెలుఁగున నెక్కడను లేదు. తెలుఁగుభాషాస్వభావమున కట్టి యుచ్చారము విరుద్ధము. అట్లగుటచేఁ దెలుఁగున నకారఱకారములు సంయుక్తములుగా నేర్పడవలసినచోట్ల నకార ఱకారములకు నడుము, బహుప్రాచీనకాలమునఁ దెలుఁగున లిపియు నుచ్చారమును గలిగినట్టియు, క్రమముగా నాలిపియునుచ్చారమును 'డ' గా షూటిపోయినట్టియు నొక వింతహల్లు ఆగమమై వచ్చుచుండెను. అదియే నేను ఆహదనకరశాసనము, సత్యాదిత్యచోడ మహారాజు శాసనము మొదలగు వానిలోఁ గుర్తించిన వింతలిపి గల హల్లు. అది బండి ఱ' కాదు. థ కాదు. ఆ వింతలిపియొక్క ప్రాచీనకాలోచ్చారము కొంత టవర్ణాక్షరముల యుచ్చారమునకుఁ జేరిక గలదై యుండవచ్చును. అదిపెక్కుచోట్ల 'ద' గా మాటినది. కొన్ని చోట్ల 'ట' గాఁగూడ మాటియుండు నట్లు నే ననుమానించున్నాను.

ఇప్పుడు 'న' కారము, 'వింతహల్లు', 'ఱు' సంయుక్తమైన యక్షరముతో శబ్దరూపము లేర్పడఁగా, బహువచన ప్రత్యయమగు 'ఱు' లోపింపఁగా హలంతము లయిన పదముల చివర 'ఉ' చేరఁగా, నేకవచనమున అవను, మగను,

రామను ( న క్రింద నున్నదే వింతలిషి గల వింతహల్లు.) ఇత్యాది రూపములు కలిగెను. ఈ హల్ రూపములే సత్యాదిత్యచోళ మహారాజాదుల శాసనములందు లెక్కలేనన్ని యున్నవి. క్రమముగా నీ వింతహల్లు 'డ'గా మాఱగా 'డ' కుఁబూర్వమున నున్న 'స' 'ణ'గా