పుట:Telugu merugulu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


12

తెలుఁగున ప్రథమావిభక్తి ‘ండు' ఎట్టు పుట్టినది?


తెలుఁగుభాషలో నేఁడు ప్రాయికముగా మహద్వాచకము లయిన శబ్దముల తుద ప్రథమావిభక్తి ప్రత్యయముగా 'ండు గలదు. ఇది దీర్ఘపూర్వ మగునేని యరసున్నగా మాఱును. హ్రస్వపూర్వ మగునేని యరసున్నగా గూడ మాఱును. మఱియుఁ బ్రాయికముగా ప్రాతిపదిక మది తత్సమమో, తద్భవమో యగునేని 'ండు'కుఁ బూర్వమున్న హ్రస్వాకారమునకు ఉకారముగూడ వచ్చును. వాఁడు మగండు, మగఁడు, రాముండు, రాముఁడు-అనునవి యుదాహరణములు. కానీ యీ రూపము లర్వాచీనకాలము సాటివి. ప్రాచీన కాలమున నీవి 'వాట్టు' మగజ్జు, రాముజ్జు, అను విధమున నుండెడివి. లిపి యిట్లే యున్నను ద్విత్వ శైథిల్యముచే నివి తేలఁబలుకఁబడుచుఁగూడ నుండెడివి.


ఇంక వీనిలో 'ణ్డు' ఎట్లు వచ్చినదో కనుఁగొసఁ బ్రయత్నింతును. ప్రాయికముగా తెలుఁగుపదములు పెక్కులు ప్రథమావిభక్తి బహువచన రూపములను ముందు పడసి వాని ననుసరించి, తర్వాత నేకవచన రూపములఁ బడయట కాననగును. ఈఁగలు, చిలుకలు, అడుగులు, చెఱువులు ఇత్యాది బహువచనరూపములు ముందు పుట్టిన పిదప వీని ననుసరించి ఈఁగ, చిలుక, అడుగు, చెఱువు ఇత్యాద్యేకవచనరూపములు తర్వాత పుట్టినవి.

ద్రావిడ భాషాకుటుంబమున ప్రథమనిష్పన్నమైన యలవమున అవన్, మగన్, రామన్ అనునవి ప్రథమావిభక్త్యంతపదములు, అజవము తర్వాత పుట్టిన తెనుఁగున కీపూర్వభాషలోని ప్రథమావిభక్త్యంతపదములే