పుట:Telugu merugulu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుంగుమెఱుంగులు

129


 అటు గాన దోహరు లన నెటు వచ్చు.
పటుతరంబగు భక్తి పరుల వెండియును"

{ప్రధమప్రకరణము) అని కలదు. ఇన్నింటిని బట్టి 'దోహరి' మాల యని యెఱుఁగ నగును. మఱి యీయన్నింటి కంటే వ్యక్తమగునట్లు ఓరియంటల్ లైబ్రరీ 14-4-28 నెంబరు పుస్తకమున-

“కళ్యాణ మందు దోహర కక్కయ్య అనే భక్తుడు తోళ్ల తిత్తులు కూర్చేవాడు, దోహారుల కులంయందు జనియించి తన పూర్వాశ్రమం ఖండించి వీరశైవదీక్ష..." ఇత్యాగాఁ గలదు.

దీనిఁబట్టి దోహరిపదము 'గొడారి'కి పర్యాయపద మని స్పష్టపడినది. గొడారులు తోళ్లతో చెప్పులు, తిత్తులు కుట్టుచుందురు. వారు మాలవారిలో నొక తెగవారు. 'మాలకు మాంసంబు, మటి గొడారికిని దోలును' నన్నట్టు-బసవపురాణము. ఈ ద్వీపద శ.ర.లో భాగవతమున నున్న ట్టున్నదీ-సరికాదు. క్రీడాభిరామమునఁగూడ మోహరిపొడ' ను దోహరివాడఁ జేయవలెనేమో! 'దోహారులు' చెప్పులు మొదలగు తోళ్లకుట్రమే కాక వెలివాడవారికి 'రవికలు' మొదలగు బట్టలకు ట్రముకూడఁజేయువారు గాఁబోలును! ఇట్టి యాచారము తెలుగునాఁట గొన్ని యేండ్ల క్రిందటి దాఁక సాగుచున్నట్టు వినికి,