పుట:Telugu merugulu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

తెలుఁగుమెఱుఁగులు


- మఱియు నాముక్తమాల్యదలో, "అనినఁ గహకహనవ్వి యదోహరికి సురద్రోహి యిట్లనియె" (9-31 వసము) అని కలదు. ఇక్కడ ' దోహరీ' యనఁగా మాల (దాసరి), చండాలుడు వెలివాడవాఁడే. అచ్చుపుస్తకములలో “అద్దాసరికి సురద్రోహి యిట్లనియె" నని కలదు కాని, ఓరియంటల్ లైబ్రరీలోని వ్రాత ప్రతులలో ఒక్కదానం దక్కఁ దక్కిన న్నింటను ' దోహరి' అనియే కలదు. బ్రౌనుదొరగారును, సీతారామా చార్యులవారును దాహరి యన గ్రహించి నేఁ జూపిన యాముక్తమాల్యదా ప్రయోగమునే యుదాహరించిరి. దాహరీ-దాసరి రూపభేదము లని వారి తలపు. కాని యా పదము 'దోహరి' యే! ఆముక్తమున ' దోహరికి సుర-⑥మి' యని 'ద్రో-ద్రో' యతీసంగతి యుండుటఁ ప్రాంతప్రతు లన్నింట దోహరి యనియే కానవచ్చుట, కాశీఖండమునను 'దోహరి బంటు' ఉండుట, అది 'దోహరి' యే యనుటకు సాధకములు, మటియు, బసవపురాణమునను, పండితారాధ్య చరిత్రమునను 'దోహరి కక్కయ్య' యను శివభక్తుని చరిత్ర మున్నది.

శివభక్తులయిన మాలలతో ద్విజులు సరిగా రని చెప్పు కథా సందర్భములో

“ముక్కంటిగుణము దాఁ గక్కయ్య నాఁగ-
నీ ద్విజులకు వైరి...

(విష్ణుమాహాత్మ్యము వర్ణించు పురాణభట్టును ముక్కలుగా నఱికి చంపెను. )

దోహరి కక్కయ్య మాహాత్మ్య మెఱఁగి
యూహింప భక్తుల నొండనందగునె"

(బసవపురా.7 ఆశ్వా!

అని కలదు. పండితారాధ్యచరిత్రమున-

"కలసె నంత్యజుఁ డనఁగా నెట్లు వచ్చు. "
నిక్క మట్లునుగాక కక్కయ్యగణము.

{బసవపురాణకథయే