పుట:Telugu merugulu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుఁగులు

127


ప్రయోగము లుండ వలదా? కొన్నాళ్ళకు భారతిలో ప్రకటితమయిన త్రాళ్ల ప్రొద్దుటూరిజాసనమున “తెలు పక్కఁ గలువోవ బెళగిన పునుక మించిన వెండికోరగాఁ జేతఁ బట్టి" అని ప్రయోగము గానవచ్చినది. ఇందు 'బెళగిన' అనుచో 'ళ,గ' ల నడుమ సున్న లేదు. బెళగు, బెడగు రూపభేదములే. సోమనాథుఁ డీ ధాతువును సానుస్వారముగాఁ బ్రయోగించెను, శాసనము ననుసరించి, కోరను బెడగనో' అని సోమనాథుని, పాఠము సంస్కరించుటా? అర్థము కుదిరినదిగానీ అది సానుస్వారపదమా? నిరనుస్వారపదమా? సందేహమే.


దోహరి


క్రీడాభిరామమున ..... దాత్యూహవ్యూహంబులుం గలిగిన మోహరివాడయందు...” “కొలుచును జేనవెట్టి " ఇత్యాది పద్యము కుట్రపువాని వర్ణనముతో నున్నది. దానిఁ బ్రకటించునాఁడు మోహరివాడ యనఁగా నా కర్థము తెలియదయ్యెను, “యుద్ధభటు లుండువాడ యనుకొందును" అని పీఠికలో వ్రాసితిని. మోహరము = యుద్ధవ్యూహము అని అర్థ ముండుటనుబట్టి యట్లనుమానించితిని. ఇటీవలఁ దెలియవచ్చిన క్రొత్తయర్థము:

కాశీఖండము సప్త మాశ్వాసమున-

"ప్రార్ధింప నున్నాఁడు పాదాగ్రముల వ్రాలి
వెలివాడవాండ తద్విప్రకులుని"

ఇత్యాది పద్యమున,

-దీపింప నున్నాఁడు తెలిసి దోహరిబంటుఁ తెవి నక్షమాలికఁ జెరివి ద్విజుఁడు " అన్నచోట 'దోహరిబంటు' ఉన్నాడు. ఈతఁ డిక్కడ మఱియు చండాలుఁడు, మాల, వెలివాడవాఁడు అనియుఁ జెప్పఁబడినాఁడు.