పుట:Telugu merugulu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

తెలుఁగుమెఱుఁగులు


'తేఁడు'కు 'వెదకు' అర్థము స్పష్టమగుచుండఁగాఁ, దదనుసారిగా క్రీడాభిరామపద్యమునకు నేఁ జెప్పిన యర్థము “ఏమాత్రము సందర్భోచితముగా లేదు", "సమంజసముగా లేదు" అఁట! ఏలో ? ఆ బ్రాహ్మణుఁ డోరుఁగంటికి వేడుకలమీఁద వేడుకలు దిలకించుటకు, విహరించుటకు వచ్చినాఁడుగానీ యారగించి నిద్రించుటకుఁ గాదు. దిట్టముగా తిండి దీని తాంబూలచర్వణము సేయుచు వేడుకపట్టులు వెదకఁబోవు చున్నాఁడను నర్థమేల సమంజసముగాదు?

బెడంగు

బసవపురాణమున-

"కోర బెడంగునో కుంచెఁడు లేవొ
ఆరగింపంగం నేరకుండినా"

అని గొడగూచికథలో ద్విపద గలదు. ఇందు 'బెడంగనో' కు అర్థము కుదరక తంటాలు పడితిని. శ.ర. బెడఁగు = అందగించు ఇత్యాద్యర్థములు పొసఁగవు. వెడఁగు = వికారము అర్థముగల దగుటచే, పాలగిన్నె పాలు త్రాగుట కనువుగా లేక, మూతి వెడల్పై వికారముగా నున్న దనీ త్రాగవైతివా అని యర్ధము కుదురుట గుర్తించి, 'అని + ఓ (అనియో) ఉండక, 'అనో' ఉండుట అతృప్తి గొల్పఁగా, సందేహచిహ్నముతో నాయర్థము పీఠికలోఁ దెల్పితిని. ఆ నడుమ శ్రీరాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగా రొకనాఁడు సంభాషణలో భీమకవి కన్నడ గ్రంథమున గిన్నె తోమనైతినా' అని పరివర్తన ముండుటను దెలిపిరీ; తెలుఁగున బెడఁగు= శుభ్రపఱచు అనుటకు ప్రయోగాంతరము లున్న గదా యా యర్థము చెప్పుఁగుదురుట అనిరి. శబ్దరూపనిష్పత్తిరీతిని పూర్వపూర్వము గుర్తించిన, వెలుఁగు, బెడఁగు పదము లొక్కదాననుండి యేర్పడినవేయగు సనుకోంటిమి. కాని భాషలో