పుట:Telugu merugulu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

తెలుగుమెఱుంగులు


అర్థమున 'తండుదల్ తేడుదల్, 'తేడి తేడి', ఇత్యాదులు దమిళమున సర్వసామాన్యముగా వాడుకలో నుండును. రెండు తేఁడులు రూపాంతరము లగుట అంగీకరించిన విషయమే కదా. తెలుఁగునంగూడ "వాఁడు తెండుకు తెండుకు అవస్థ పడుచున్నాఁడు నే నన్న మాటకు" ఇత్యాది వ్యవహారము నా జన్మదేశమగు కృష్ణా ముండలమున నున్నది. 'తెండు' కు “తిరుగఁ దోడు, కలఁబెట్టు' పేనఁగులాడు, వెదకు, తదేకవిచారముతో నుండు" ఇత్యాది విధముల నర్థము సంగత మయియున్నది. ఆముక్తమూల్యదా, కకుత్ స్థవిజయప్రయోగములు నేఁజెప్పిన యర్ధమునకుఁగూడఁ బొసఁగునవియే “చంద్రకాంతశిలాశాలలోఁ దాపము గొల్పని పట్టు వెదకి" అనియు, “వరుణుని గుండెల వెదకుచుఁ (గలఁ బెట్టుచు)' అనియు మీఁది పద్యములలో నేఁ జెప్పిన యర్థము సరిపోవుచునే యున్నది. మఱియు నాముక్తమాల్యదాపద్యమున ప్రాచీన ప్రతులలో గొన్నింట.


“అతివ పూర్ణేందు భీతిఁ దదర్మశాలం
ద్రేణి యతఁ డందు నినుముడి తీండ్రఁదోఁప"


అని కలదు (ఓరియంటల్ లైబ్రరీ 11-2-1 ప్రాంతప్రతీ). దీనికి శ్రీనివాసీయవ్యాఖ్యలో “యువతి పూర్ణచంద్రునిమీఁద భయపడి చంద్రకాంతశాలలో ప్రవేశించి, ఆచంద్రకాంతశాలయందు చంద్రుడు మిక్కిలి వేండ్రముగా కానవచ్చేటప్పటికి” అని కలదు. సి.పి. బ్రౌనుదొరగారుకూడఁ దమనిఘంటువున నీపట్టున ప్రయోగమును "శ్రేణి" యనియే గ్రహించిరి బి. సీతారామాచార్యులవా రేలొకో, బ్రౌనుదొరగారి పాఠమును గ్రహించినవారు గారు. మఱియు, బ్రౌనుదొరగారు "శ్రేణి "కి ఆముక్తమాల్యదనుండియే ప్రయోగాంతరమును గూడఁజాపిరి. అది యిది: