పుట:Telugu merugulu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

123


ఆతివ పూర్ణేందుభీతిఁ దదశ్మశాలం
దేఁడి యతఁ డందు నినుమడి తీంద్ర దోఁప
మింటిపై నుంట కాదని యింటి పైకి
దెచ్చుకొంటి నటంచుఁ బెచ్చ వెడలు.

(ఆముక్త. 5-146)

ఉదాహరణముగా నీయఁబడినది. ఈ యర్థమే క్రీడాభిరామ ప్రయోగమునఁగూడ నెంతయు సమంజసముగా నున్నది. ఈ బ్రాహ్మణుఁడు పూటకూటింట భుజించి తాంబూలము వేసికొనుచు నెక్కడకో శయనింపం బోవుచున్నాఁ డని యిట భావము. మఱియు,


"అనలునిఁ గాఁడుచుం జముని నాడుచు రాక్షసుఁ బాడుచుం గప
నొసలు చూడుచుం దనుజు ప్రేవులు దోడుచు గాడ్పు కదులో
గునుకులు గోడుచున్ వరుణు గుండియఁ దేఁడుచు వాహనేంద్రు సం
దీని జన వేఁడుచున్ సృపతి నేర్పులు దీడుచు వెండి వాడిగన్',

(కకుత్స్థ. 5-123)

'గుండియఁ దేఁడుచున్ = గుండియయందు శయనించుచు --- ఇతరులను బెదరించునప్పుడు 'నీ గుండెలో నిద్రపోవుదును' అనుట వ్యవహారమునఁగలదు. దానినే యీ కవి యిట గ్రహించినాఁడు. మఱియు 'తేఁడు' ధాతువుసమానార్ధక మగు 'తెండు' ధాతువుసకుఁ గూడ 'శయనించు' అను సర్ధమే సప్రమాణముగాఁ గాన్పించుచున్నది. పై విషయము లన్నియుఁ బరిశీలించి చూడఁగాఁ గ్రీడాభి రామప్రయోగములో శ్రీ శాస్త్రిగారు వ్రాసినయర్థము సమంజసముగా లేదని తోఁపకపోదు."

ఇందుకు నా సమాధానము.

'తేఁడు' కు 'వెదకు' అను నర్థముకూడఁ గల దనుటయే నాయాశయముగాని ' శయనించు' అను నర్థము లేదనుట గాదు. 'వెదకు'