పుట:Telugu merugulu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

తెలుఁగుమెఱుఁగులు


పెద్దనామాత్యుఁడు 'ఆధివెట్టిరి' అని ప్రయోగించుట యేల యని పరిశీలింతునుగదా, మనుచరిత్రమునఁగూడ 'ఆహివెట్టిరి' అనియే యుండుట కానవచ్చెను. ప్రాచ్యలిఖితపుస్తకశాలలో మనుచరిత్ర వ్రాత ప్రతులు 15 ఉన్నవి. అందు 11 ప్రతులలో 'ఆహిపెట్టిరి' ఉన్నది. తక్కినవి కొన్ని కాగితపుఁబ్రతులు, ఇటీవలివి. అందు 'ఆధివెట్టిరి' ఉన్నది. ఆహిపెట్టు = తాకట్టు పెట్టు అనుసర్ధముననే ప్రయోగాంతరము,

అప్పుడే గోవిందునికి ఆహివెట్టితిఁజిత్తము.
(తాళ్లపాకవారి యధ్యాత్మ సంకీర్తనములు, పుట. 69)

ప్రాకృతమున గాథా, కధా శబ్దములకు 'గాహా', 'కహా' రూపములు కలవు. 'ఆధి' శబ్దమునకు 'ఆహి' ప్రాకృతరూపము కాఁబోలును! ధ,ధలకు హకారాదేశము కొన్ని ప్రాకృతములందు గాననగును.


'తేడు.


“వీడిదె తెల్లసాకులను వీడెము సేయుచు వీధి వచ్చుచు
న్నాఁడు మదించి తిండి తినినాఁడుసుమీ యిటమీఁద నేడకో
తేఁదంగఁ బోయెడిన్ గరణదేశపుజాణఁడు గాఁగనోపు నీ
బాఁడు పడోపహార పరిపాటి యెఱుంగఁగవచ్చు వీనిచేన్||

(కీడా. 53 పొ.)


ఆక్షేపము


ఇట 'తేఁడు' = వెదకు' అని (పీఠిక 121 పా.) శ్రీ శాస్త్రిగా రర్థము వ్రాసినారు కాని తేఁడు ధాతువున కీయర్ధమును, తన్నిర్ణాయక ప్రయోగములును గాన్పింపవు. ఇదియేగాక ఈ పద్యమునఁగూడ వీరు వ్రాసిన యర్థ మేమాత్రమును సందర్భోచితముగా లేదు. శబ్దరత్నాకరములో నీ పదమునకు 'తెండు', 'శయనించు' అనునర్థము వ్రాసి,