పుట:Telugu merugulu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుంగుమెఱుంగులు

115


సుందరమయినది. ఎట్లనఁగా పయిపద్యోపన్యాసముఁబట్టి ఆనందమే బ్రహ్మమన్న యర్థము వ్యక్తపడును. కానీ యింతమాత్రమున వరూధీనివాదము నెగ్గదు. ప్రవరుఁ డనఁగలఁడు. 'ఇది యథార్థమే. ఆనందమే బ్రహ్మము. ఆయానందము నాకు గృహ్యాచారధర్మానుష్ఠానమువలన లభించును' అని. అట్లనుటకు వీలులేకుండ 'ఆనందమే బ్రహ్మము, ఆ యానందము సంభోగరూపము.' అని నిరూపించుటకు 'ఆనందో బ్రహ్మ' అన్న యుపనిషన్మంత్ర ప్రతీకము నిచ్చి యా మంత్రమును కడ ముట్టఁ జదువుకొని యర్ధ మూహించి చూడు మనుచున్నది. ఆమంత్ర మిది.


“ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్,
ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయస్తే,
ఆనందన జాతాని జీవని
ఆనందం ప్రయ స్త్యభిసంవిశంతీతి",


దీనికి పరూథినితలఁపులో నున్న యర్థ మిట్టిది.

"ఆనందమే బ్రహ్మ మని తెలిసికొనెను. అనందమున నుండియే {సంభోగానందముననుండియే) భూతములు జనించుచున్నవి. పుట్టిన యా భూతములెల్ల నా (సంభోగా) నందముచేతనే వర్ధిల్లుచున్నవి. ఆ యానందములోనికి ప్రవేశించుచున్నవి. ఆ యానందమునకే యభిముఖ స్థితిని బొందుచున్నవి”. ఇంత కింకను బచ్చిగా వివరించి చెప్పుఁదగినట్టిది వరూథినితలఁపులోని యర్థము.

వరూథినీ యచ్చరపువ్వుఁబోఁడి; స్వాధ్యాయానుష్ఠానపరు లగువిప్ర వర్యులెందలో స్వర్గమునకు రాఁగా వారితోఁ బ్రసంగములు గావించి ప్రొడి కెక్కినది. అద్వైతులు జీవబ్రహ్మైక్యప్రతిపాదకత్రుతులను, ద్వైతులు జీవబ్రహ్మ విభేదప్రతిపాదకశ్రుతులను, ఇంక నాయావైదికమతములవారు