పుట:Telugu merugulu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

తెలుంగుమెఱుంగులు


తమతమ మతముల కనుకూలము లగుశ్రుతులను సేకరించి యుంచుకొనునట్లు, వరూథిని తృతీయపురుషార్థమే పరమార్థ మని నిరూపించుటకుఁ దగ్గశ్రుతులను గూర్చికోని నేర్చుకొనియున్నది గావలయు, పయి శ్రుతికి వరూధీని నిర్ణయించుకొన్న యర్ధము చొప్పుననే నన్నిచోడ మహాకవి యొక పద్యము రచించినాఁడు.


"పృథుల విశ్వంభరా రథమున కెదురుగా
బూన్పించె నెవ్వాఁడు పువ్వుఁదేరు.
కొంచనాచల కార్ముకమునకు సాటిగాఁ
జేపట్టి నెవ్వాఁడు చెఱకువిల్లు,
అవిరళ (తథ?) పాశుపతాస్త్రమ్మునకు వాడి
మిగిలించె నెవ్వాఁడు చిగురుఁదూపు
అతులితామరదానవాదిబలంబుల
గెలిపించే నెవ్వఁ డయ్యలిబలమ్ము
నట్టి జగజెట్టి మన్మథుఁ డఖలిలోక
ములకు వెఱగొంగ జీవులమూలకంద
మతని యిలుసొచ్చి వెడలనియతఁడు గలఁడె


యతని యమ్ములఁ బడకున్న యదియుఁగలదా?" వరూధిని యుపనిషన్మంత్రమునకు గోచరింపించిన క్రొత్త యర్థమును బర్యాలోచింపఁగా ప్రవరుసకు సిగ్గును, వెగటును బొడమినవి. సంభోగవిషయ మని సిగ్గు, పవిత్రమైన మంత్రార్ధము పాడుపడిన దని వెగటు.