పుట:Telugu merugulu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

తెలుంగుమెఱుంగులు


గున పట్టిన... కొమ్మ' పలుకుబడికల్మికి నే పట్టింది. మునగకొమ్మ కాదులే' అని రామదాసు కీర్తన తార్కాణ.

ఈ పద్యమునుగూర్చి కడప వాస్తవ్యులు కళాప్రపూర్ణులు శ్రీ శేషాద్రిశర్మగారు కడపమండలముస సిగరచెట్లని చెట్లు కలవ నియు, వానికిఁ జేవ యుండ దనియు, ఆ సిగరచెట్ల కొమ్మలే చిగురుకోమ్మ లనఁబడె సనియు, పెద్దన కడపమండలమువాఁడు గాన, తదనమ్మురణమున వరణానదీతీరపు టరుణాస్పదపురవర్ణనమున వానిఁ బేర్కొనె ననియు ననిరి. ఈ పద్యమున వేశ్యలుగూడఁ గడపమండలమువారు గావచ్చును. 'కడపఁగలరు' పాఠ మున్నది గదా!!

ఆనందో బ్రహ్మా


"ఎందే డెందము గందళించు రహిచే నేకాగ్రతన్ నిర్వృతిన్
జెందున్, గుంభగత ప్రదీపకళికా శ్రీ దోఁప నండందుఁబో
కెందే నీంద్రయముల్ సుఖంబు గను, నా యింపే పరబ్రహ్మ మా
నందో బ్రహ్మయటన్న ప్రాజడువు నాంతం బర్ధ మూహింపుమా!"


నాకు నచ్చిన పాఠప్రకారమునఁ బైపద్యము నుదహ రించితిని. అచ్చులోను, వ్రాఁతలోను దీన మఱికొన్ని పారాంతరములుగలవు, 'కందళింప', 'అంతుర్బుద్ధి' అనునవి యాపాఠాంతరములు.

ఇందు 'ఎందే డెందము' - ఆదిగా సుఖంబుగను వలకు రెండు వాక్యములు. తొలి వాక్యమున 'కందలించు'కు శ్రీజయపురాధీశ్వరులు పొసఁగించిన ధాతుజ విశేషణత్వము సుందరము. ఈ విషయము కాదు ప్రధానముగా నే నీపద్యమునఁ జెప్పఁబూనీనది.

'ప్రాఁజదువు సంతర్బుద్ధి నూహింపుమా' అన్న పాఠముకంటె 'ప్రాఁజదువు నాంతం ఐర్ల మూహింపుమా' అన్నపాఠము చాలా