పుట:Telugu merugulu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

113

తెలుంగుమెఱుంగులు


నుండి దిగివచ్చి, రంభాద్యప్సరసల నయినను వంతున కెక్కఁజూచినం దమపృష్ఠభాగపుఁగోఁక (గోచి) కొంగుతో వెనుకకుఁ దొలఁగఁద్రోచి తాము ముందడుగు వేయఁగలరు. కడవఁగలరు = ముందడుగు వేయఁగలరు. ఇక్కడ 'కడప', 'కధుమ', 'కడవ' - పాఠము లున్నవి. ముద్రణమున 'కడప' గలదు. నేను 'కడవ' గైకొంటిని. ఇట్లి రెండు చరణములందును వేశ్యాసామాన్యవర్ణనముచేసి పెద్దన కడపటి చరణమునఁ దద్వీశేషవర్ణనము చేయుచున్నాఁడు. 'నాట్యరేఖాకళా ధురంధరనిరూఢీ' ని 'అచటఁ బట్టినం జిగురుఁ గొమ్మైనఁ జేవ' అచటన్ = ఆయూర, పట్టిన = పరీక్షింపగా నాట్య మాడించి చూడఁగా వంచిపట్టి చూడఁగా. చిగురుఁగొమ్మైనస్ పుష్పిత కానీ, అంగసౌష్ఠవ మింకను సరిగా విరియని పసితనపు (వెల) కొమ్మ - ఆడుదికూడ (కొనసాగుచున్న తలిరుఁ(లేంత గొమ్మ కూడ), చేవ = చేవగలదే, గట్టితనముకలదే.

ఇంచుకవివరణము.. ప్రౌఢలగు నాయూరివెలయాండ్రు రసికుల కలయికలం దాటితేఱి యనుభవజ్ఞానము గడించినవారు గాన రంభాదులతో నారసి, శృంగారరససంప్రదాయ విశేములను నాట్యాభినయములందుఁ జూపి నేర్పు మెఱయింపవచ్చును. అది విశేషముగాదు. రసానుభవమునక్కు దగ్గవయ సింకను రాక ముందే పసిప్రాయమందె-ఆయూరి వెలకన్నెలు నాట్యాదులందుఁగడుచతురలు. అర్థాంతరన్యాసముగా నాల్గవచరణము మాత్రము వేర్పఱిచిన నాయూరఁబట్టి (వంచి) చూచిన లేఁత కొమ్మలుగూడఁ జేవగలవే. పసివారుకూడఁ గడుఁబ్రోడలే యనియు నేర్పడును. ఈ పద్యమున కానె కొంగున వారించి కడవలగలరు' అన్న పాఠము 'గదుమఁగలరు' అన్నపాఠముకంటెను, 'కడపఁగలరు' అన్న ముద్రితపాఠము కంటెను సుందరతమము. మఱియు అంచటఁబుట్టిన చిగురు' అనుపాఠము కంటె 'అచటఁ బట్టినఁ జిగురుఁ' అన్నపాఠము సుందరతరము. తెనుఁ