పుట:Telugu merugulu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

తెలుంగుమెఱుంగులు


పై సీసపద్యము తొలి నాల్గు చరణములలో నాల్గువర్ణములవారీ వర్ణన మున్నది. ఎత్తుగీతి మూఁడుచరణములు వెలయాండ్ర వర్ణనముగాను. నాల్గవచరణము "ఆయూరఁబుట్టినది సర్వమును సారవంతమే" యని సర్వవస్తుసామాన్యవర్ణ నాత్మకమునుగాను ప్రాచీన వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించిరి. కాని యిట్టి యన్వయమునఁ గూర్పుసొంపు గొంత కొఱవడును. సీసచరణములు నాల్గింట వేర్వేఱుగా నాల్గువర్ణ్యము లున్నట్టు. ఎత్తుగీతి నాల్గు చరణములను నాల్గువర్ణ్యములు వేర్వేఱుగా నుండుటగాని, రెండేసి చరణముల కొక్కటి చొప్పున నాల్గు చరణములకు రెండు వర్ణ్యములుండుటగాని లేక నాల్గింట నొక్కటే వర్ణ్యముండుటగాని నేర్పుగల కూర్పనిపించును. ఎత్తుగీతిరెండవ చరణముతుదని సమాపకక్రియ గలదు. వాక్య ముక్కడికి సమాప్త మైనది. వ్యాఖ్యాతల వ్యాఖ్యాస రీతికి మూఁడవచరణము నా సమాప్తవాక్యములోని కీడ్చుకొనిపోయి యన్వయింప వలెను. పెద్దనామాత్యున కట్టి యన్వయ మభిప్రేమ యేని అతఁడా మూఁడవచరణమును రెండవ చరణముగానే నిలిపియుండఁగలఁడు. అప్పు డన్వయ సారళ్యము పొసఁగును. పెద్దన పయిపద్యమున నొక్కొక్క వర్జ్యమును 'అచటి' ఇత్యాదిగా వేర్పడిచి వర్ణించినాడు. ఈ తీరును గుర్తింపవలసినదే.

ఇవి యెల్లఁ బర్యాలోచించినపై నాకుఁ దోచిసయన్వయపద్ధతి నిది తెల్పుచున్నాఁడను. ఎత్తుగీతి నాల్గు చరణము లందును వర్ణ్యమొక్కటే వెలయాండ్రే. కాని నాల్గు చరణములలోను తొలి రెండు చరణములు నొకవాక్యము, తుది చరణ మింకొక వాక్యము. మూఁడవచరణము దేహళీ దీపన్యాయమున రెండు వాక్యములందును బొందుపడును. తొలి రెండు చరణములు వేశ్యాసామాన్యవర్ణనము, తుదిచరణమునందు దద్విశేషవర్ణనము. తొలి వాక్యమునకు-అచటి వెలయాండ్రు (దేవలోకము