పుట:Telugu merugulu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుంగుమెఱుంగులు

109


మోవఁగ = దోర్మూలకూలంకషములుకాఁగా ('ప్రతిక్షణ విజృంభణా దుభయబాహుకూలంకషస్తనత్రుటితకంచుక' మిత్యాది ప్రయోగముల ననుసంధించునది). అధరం బాసించినది. ఇక్కడ పైయంచుల్ = చూచుకములు అని వ్యాఖ్యానము సుందరము గాదు. రతిసంరంభము మీట పై పాటునఁ జేసిన కౌఁగిలింత యట్టిదిగా నుండదు. ఈ సందర్భము నింకను దెలిఁగించుట బాగుగాదు. కళాప్రపూర్ణులు శ్రీ శేషాద్రిశర్మగా రిక్కడ నిట్లు వ్రాసిరి. "బాహుమూలరుచితోన్ = భుజశిఖరముల కాంతితో... మూల మనఁగా మొదలు,బాహుమూలము లనఁగాభుజశిఖరములు అను సర్ధ మేరుడుసు.బాహుమూలము కేయూరము లనుభూషణము లుండును. స్త్రీలకు నుండునా యని ప్రశ్నింతురేమో! స్త్రీపురుషసాధారణము లగుభూషణములే యవి యని యేర్పడును. కేయూరచతుష్టయము పరమేశ్వరికీ భూషణములుగాఁ జెప్పఁబడినవి. కావున నా పేరుగల భూషణములతోఁ గూడిన బాహుమూలముల కాంతితోఁ బాలిండ్లు పొంగార, అనఁగా నాకేయూరరత్నకాంతులు వక్షోజములపై వ్యాపింపఁగా నని యర్ధము సిద్ధమగును... ..... కంచుకము సడలించిన దని యంగీకరించినను రూఢ్యర్ధమగు బాహుమూలకాంతి యసంగత మనవలయును. వీనికిఁ బ్రోద్బలముగాఁ బై పద్యమున “నీ వీ బంధ మూడన్' అను మొదలగు రతిసంరంభచిహ్నములు చెప్పుల బడినవి. కనుక రూఢ్యర్ధ మంత సరసము గా దని తోఁచెడిని".


విమర్శ మిదె యేమో నేఁ దెలియఁజాలకున్నాఁడను. సంస్కృతాంధ్ర కవులు పలువురు భుజయుగము వయికెత్తిన సందర్భములందు స్త్రీబాహుమూలద్యుతుల' వేలమువెఱిగా వర్ణించిరి. ఆంధ్రమున నిట్టి సందర్భము వర్ణింపని యర్వాచీన కవి యుండఁ డనవచ్చును. వరూధిని