పుట:Telugu merugulu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

తెలుంగుమెఱుంగులు


- 21 - ఉపాధ్యాయి

"ఈ పాండిత్యము నీకుఁదక్క మఠ యెందేఁగంటియే"

అన్నపద్యములో 'కామశాసోపాధ్యాయివి” అనంగా ఉపాధ్యాయుని పత్ని అనికాక, స్వయము వ్యాఖ్యానము చేయనేర్చిన యుపాధ్యాయురా లని యర్ధము. వరూధిని యుపనిషన్మంత్రమునకు స్వయము క్రొత్తర్ధము కల్పించినది గదా!


-22- బాహూమూలరుచి


ప్రవరుఁడు రోఁతచెంది 'చెప్పకు మిట్టి తుచ్ఛసుఖముల్ మీసాలపైఁ దేనియల్' అని తెగడఁగా వరూధిని హృదయాజ్ఞము జల్లన. నీవీ బంధ మూడఁగా, కొప్పు వీడఁగా, రతిసంరంభము మీఱఁగా, పైపాటున

"ప్రాంచద్భూషణబాహుమూలగుచితోఁ బాలిండ్లు పొంగారఁ బైయంచుల్ మోవఁగ గౌఁగలించి యధరం బాసింప........"

ఈ పద్య మిట్లు ముద్రణములం దున్నది. వ్యాఖ్యాతలు "ప్రాంచ ద్భూషణములయొక్కయు, బాహుమూలముల యొక్కయుఁ బ్రకాశముతో పాలిండ్లు, పొంగారన్ = ఉబ్బఁగా, పైయంచుల్ = చనుమొనలు, హెచః గన్ = అనునట్లుగా, కౌఁగిలించి" అని వ్యాఖ్య వ్రాసిరి. కాని ప్రాంత ప్రతులలో : పాలిండ్లు పొంగారి పైయంచుల్ మోవఁగ' అని పాఠ మున్నది. ప్రాంచద్భూషణములగు (ప్రాంచద్భూషణపదము బాహులకుల గానీ, తన్మూలములకుఁగాని విశేషణము) బాహుమూలముల కాంతితో (ఆ కాంతి యలముకొనె ననుట) పాలిండ్లు పొంగారి, పై యంచుల్