తెలుంగుమెఱుంగులు
107
- 19 -
అనుకూలగతి
“అనుకూలవతి నాదు మనసులో వర్తించు కులకాంత మది నెంత
గుందునొక్కొ”. ఇక్కడ 'అనుకూలవతి' యన్న పదము కేశపడి
సమర్ధింపవలసినది, అనుకూలపదమున కానుకూల్య మర్ధము చెప్పుకోవలెను.
'అనుకూలగతి' యన్న పాఠము వ్రాతప్రతులలో సున్నది. దీని గ్రహించిన
నే యసందర్భము నుండదు.
- 20 -
కుఱంగలి, ఓసరించక
“గొంటుందనం బెఱుంగక కుటుంగటనున్న యమ్మహీసుర ... గదురు
మనంబున నొసరించక చంచల దృగంచలప్రభలు.............. ( (2-61)
పయి వచనమున అనుప్రాససంగితినిబట్టి 'కుఱంగట కంటె 'కులుంగట' యుండఁదగు ననిపించును. శబ్దనిష్పత్తికూడ (కుఱు + కలను) 'కుఱుఁగలి' యగుటకే ససిపడును. ప్రాంతప్రతులలో 'కుఱుంగట' అన్నరూప మున్నది. మటియు నీపదము సోమనాథుని యుత్తరహరి వంశమునఁగూడ 'కుఱుంగలి' యని యనుప్రాససంగతితోనే కలదు.
“చక్రంబు మొదలగు కైదువలు మెఱుంగులు
గుఱుంగలించిన రవీమండలంబు తెఱంగున
(ఉ.హరీ. 4 ఆశ్వా)
ఇట్లు చూడఁగా 'కుఱుంగలి' రూపము సాధు వని యేర్పడినది. 'కులంగలి' రూపపు సాధుత్వము చింత్యమే. మఱియుఁ బయివచనమున 'ఓసరించక' పెద్దన సమ్మతించినది.