పుట:Telugu merugulu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

తెలుంగుమెఱుంగులు


-17. చతుర్విధ కవితలు


“శరకోపప్రసాదాసాదిత చతుర్విధ కవితామతల్లి కాల్లసాని” అని యాశ్వాసాంతగద్యమునఁగలదు. 'చతుర్విధకవిత' లనఁగా 'బంధము, చిత్రము, గర్భము, ఆశువు' అని వ్యాఖ్య. ఇది సరిగాదు. ఆశు, మధుర, చిత్ర విస్తరము లన్నవి చతుర్విధకవితలు.


- 18 - రాచవారు

'వల రాచరాచవాం డలీకాక్షు కనువెచుఁ గరఁగిన యల కనికరపుఁజోటు". (2-10


పై పాఠ మచ్చులో నున్నది. 'రాచవాఁడు' అని యేక వచనాంతముగా నా పదమున కెక్కడను బ్రయోగము గాన రాదు. 'రాచవారు' అన్నపదము ' దొరవారు' అన్నపదమువంటిది.

“ఒక చపలాక్షి లేఁజిగురుటూయేలం యలరాచవారి నిక్కకు నెలయింపవచ్చు... " (ఉత్తర హరివంశము

“ఏనిక మోముతాల్పెలుకనెక్కిసరావుతు రాచవారు" (భీమఖం. "ము)


కనుక నిక్కడఁగూడ 'వలరాచరాచవా రలికాకు కనువెచ్చ' ... సియే యుండవలెను.