పుట:Telugu merugulu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆంధ్రదేశ మంతటను సామాన్యముగా స్త్రీ పురుషులు తెల్లవారుజామున నిద్ర లేచి భూపాలరాగముతో 'గుమ్మఁడేఁడే గోపిదేవీ' ఇత్యాదిగా దధి వామన స్తుతినే చేయుచుందురు.

-16.

 మండలిక తపన
“మండలికతపన శోభిత!
కుండలిపతి శయన కర్ణకుండలిత రసా
ఖండకవి కావ్య! దిగ్వే
దండశ్రుతిడళనకలహతాడితపటహా ! "

“మండలికతపనుఁ డను బిరుదుచే శోభిల్లువాఁడా! కుండలిపతి శయనునికిఁ గర్ణకుండలములుగాఁ జేయఁబడిన రసాఖండము లగుకవి కావ్యములు గలవాఁడా!” అని వ్యాఖ్య.

'మండలికతపనశోభిత' అని సమాసమగుచో మండలిక తపనుఁడు అను బిరుదుచే శోభిల్లువాఁడా' అని యర్థము నీయఁగలశక్తి దాని కుండదు, వ్రాతప్రతీపాఠ మిట్లున్నది. “మండలికతపన! పూజితకుండలి పతిశయన!" 'మండలికతపన!' బిరుదాంకసంబోధనము. ఇఁక పద్య మీకిందితీరు సంబోధనములతో నుండును.


  • మండలికతపన! పూజిత

కుండలిపతిశయన! కర్ణకుండలిత రసా
ఖండకవికావ్య! .... ....."


రసాఖండము లగుకవుల కావ్యములను కృష్ణరాయలే కర్ణకుండల ములుగాఁ జేసికొనుచుండువాఁ డని యర్ధమగును.