పుట:Telugu merugulu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

తెలుంగుమెఱుంగులు


ఇందు "శ్రీకృష్ణదేవరాయాగ్రగణ్యుం” డనుచోట "కృష్ణరాయ వీరాగ్ర గణ్యుఁ" డని పాఠ మున్నది. "శ్రీ కృష్ణదేవరాయ" పదము సంజ్ఞావాచక మనుకొనుచో “అగ్రగణ్యుఁడు" అన్న పదముతో సమాసము ససిపడదు. “శ్రీ కృష్ణరాయ వీరాగ్రగణ్యుడుఁ" డనుపారము సుందరమయినది. తొలిపాఠమునే యభిమానించువారు 'కృష్ణదేవ' నామముగల రాజాగ్రగణ్యుల డని పొసఁగించుకొనవలసియుందురు.

14 పాలింపఁగాను


...... భూవిభుని కృష్ణరాయఁ డభ్యుదయ మంది - పెంపుమీఱంగ, ధాత్రి పాలింపుచుండ" నని యచ్చు. ప్రతులలో నున్నది. ప్రాంతముద్రణము నందును. వ్రాతప్రతులలోను "పెంపుమీఱంగ ధాత్రిఁ బాలింపఁగాను" ఉన్నది. ప్రాచీన కవులు కొందఱు 'పాలించుచు' అనియే కాని, 'పాలింపుచు' అని ప్రయోగము చేయరయిరి. పెద్దన యాత్రోవవాఁడు గావచ్చును.

- 15. వామనసుతి

"ప్రత్యూషపవనాంకురములు పై కొనువేళ హమన స్తుతిపరత్వము: లేచి" - - ఇక్కడ 'వామనమూర్తి ప్రోత్రము నందలియాసక్తిచేత విష్ణుమూర్తి స్తోత్ర పారాయణముతో ననుట' అని వ్యాఖ్య.కానీ యిక్కడ వామనస్తుతి యనఁగా 'దధివామనగ్రోత్ర' మను సంస్కృత స్తోత్రగ్రంధ మగును శ్రీకృష్ణదేవరాయలవారు తెల్లవారుజామున నిద్ర లేవఁగానే యీ దధివామన స్తోత్రమును బారాయణము చేయుట పరిపాటి. రాయవాచకమును యవాచకమును జూచునది. దధివామను+డనఁగా 'వెన్నముద్ద బాలగోపాలకృష్ణమ్మ'