పుట:Telugu merugulu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

101


కవీశ్వరులనే యధికముగా సత్కరించుచుందురుగాన శ్రీకృష్ణదేవ రాయలవారి యాస్థానిలో కవిత చేతఁగానికుకవులు కవిసత్కారము బడయగోరి, ప్రాచీసతాళపత్ర పుస్తకగతములయియున్న గ్రంథములనో, గ్రంథ భాగములనో స్వరచితములఁగాఁ బ్రకటించుకోనుచుండుటయుఁ , పెద్దనాదులు వాని గుర్తించి రాయలసన్నిధి నవమానపఱుచుచుండుటయు జరుగుచుండెడిది గావలయు.జాలీమాలి పెద్దనామాత్యులవా రటువంటి చేతఁగాని దొంగకవుల నీ పద్యమునఁ జెంగనాడినారు.


ఈ పద్యమును విని కోపించి కావలయును, పెద్దనగారియు, శ్రీకృష్ణదేవరాయలవారియు కాలముననే వర్తిల్లినవాఁ డొక యసహాయ కవితాశూరుడు, కవిరాజు (కవిరాజపద మీట తత్పురుష, కర్మధారయములు రెంటను సంగతమే. ) పెద్దనామాత్యుల వారిని వారి మాటలనే త్రిప్పికొట్టినాఁడు.


“అతికుటుంబరక్షణా పేక్షఁ బ్రాల్మాలి
కృతులు మూఢభూమీవతుల కిచ్చి
చచ్చి నీరయమునుఁ జనుకంటె హరిహరా
ర్పణము చేసి సుగతిఁ బడయరాదె?"


పెద్దన గారి “భరమై తోఁచు కుటుంబరక్షణకుగాఁ బ్రాల్మాలి" యన్నకూర్పు నీతఁడు “అతికుటుందిరక్షణా పేక్షఁ బ్రాల్మాలి' యని యనుకరించుట. పెద్దనగారు చేసిన కుకవినిందను గుర్తించి, వారి త్రోవనే సూటిగా వారికే తగులునట్లు ప్రతినింద చేసినాఁడుసుమా యని విజ్ఞులు వివేకించి తెలిసికొనుటకో యన్న ట్లున్నది. కుటుంబరక్షణకై ప్రాల్మాలి తెక్కులికవులు ప్రాచీనగ్రంథార్థముల హరించి రాజులదగ్గటు వెల్లడించుకోఁ బోయి కొలఁతఁబడుదు రని పెద్దనగా రనఁగా నీతఁడు "కుటుంబరక్షణకై ప్రాల్మాలియే సుమండి సత్కవులుగూడఁ గొందఱు మూడు లయిన (స్వయము రచింపను, ఒండె అన్యులు రచించిన గ్రంథముల సారస్యము