పుట:Telugu merugulu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

తెలుఁగుమెఱుంగులు


(మనుచరిత్రము శ్రీకృష్ణదేవరాయలవారి కాలమున వెలసిన యాంధ్ర ప్రబంధములలోఁ బేరెన్నిక గన్నది. విద్వాంసు లెందఱో దానిపయి విమర్శనముల వెలయించి యున్నారు. దాని ఘనత కవి తార్కాణములు. జాగ్రత్తతోనే నీ నడుమ నాగ్రంథమును జదువఁగా గొన్ని సందేహములు, తన్నివారణకై పరిశీలింపఁగా గొన్ని చక్కని పాఠములు, అర్ధవిశేషములు గోచరించినవి. అందుఁ గొన్నింటి నిందు వెల్లడించుచున్నాను.)


- 10 - చేర్చుక్క

“చేర్చుక్కగా నిధ దీన్ని జాబిల్లిచే
సిందూర తిలకంబు సెమ్మగిల్ల."


ఇది ముద్రితపాఠము. ఈ పద్యము సరస్వతీమూర్తివర్ణనాత్మకము. సరస్వతీదేవి చేర్చుక్క యను నగగాఁ జంద్రకళ నలంకరించుకొన్న దన్న యర్థము మీ ముద్రితపాఠమున. “చేర్చుక్కగా నుండు చిన్ని జాబిల్లిచే " నని కొన్ని వ్రాత ప్రతుల పాఠము. సాజముగానే సరస్వతీమూర్తి చంద్రకళా లంకృతమస్తక కావున తలపై నున్న యా చంద్రకళ చేర్చుక్క యన్న యలంకారపుసొంపును గూర్చుచున్న దన్న యర్థ మీ ప్రాంత ప్రతిపాఠమున. వ్రాత ప్రతిపాఠము సుందరతర మగు నేమో!

భరమై తోఁచు కుటుంబరక్షణ


“భర్తమై తోచు కుటుంబరక్షణకుఁగాఁ, బ్రాల్మాలి చింతన్ నిరం
తరతాళీదళసంపుటప్రకరకాంతారంబునం దరపుం
దెరువాటుల్ గొని కొట్టి తద్జ్నపరిషద్విజ్ఞాతచౌర్య క్రియా
విరసుండై కొలఁతం బడున్ గుకవి పృథ్వీభృత్సమీ పక్షితిన్."