పుట:Telugu merugulu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

తెలుఁగుమెఱుంగులు


క్రమపరిణామ రూపములు కావచ్చును. కాఁగా 'కోహళి' శబ్దమునకు 'కుళ్లాయి, టోపి అర్థమగును. తెలుఁగుప్రయోగములు 'కుళ్లు' అర్థమునకు సరిపడఁగలవు. 'కుళ్లా' శీర్షాచ్ఛాదనమేకదా! అది యలరు కేందమ్మియాకృతి గలది గావచ్చును.

కన్నడపు కుమార వ్యాసప్రయోగము 'శిరఆచ్ఛాదన' మనుటకు ససిపడదు. అతఁ డౌపచారికముగా శరీరాచ్ఛాదనమునకు దానిని బ్రయోగించి యుండఁబోలును.

శక 1214 నందనపుష్య శు 5 సో... నాడు శ్రీమన్మహామండలేశ్వర శ్రీవిక్రమోత్తుంగ రాజేంద్రచక్రవర్తి స్వస్తి శ్రీ త్రిపురాంతక శ్రీమన్మహాదేవరకుం బుత్తించిన పహిండిచతుర్ముఖకోహళి. దోర్దండద్వయ నిర్మదీకృత చతుర్టీ పాధిపస్థాపనాచార్య స్సూర్యసమప్రతాప మహిమా శ్రీవిక్రమోత్తుంగరాట్. ప్రయచ్ఛత్రిపురాంతకాయ వసుధాభర్తాప్రహర్తా ( ) హేమమయం చతుర్దశపలోనాభ్యాం తులాభ్యాం మితమ్.


{మార్కాపురంతాలుకా త్రిపురాంత కేశ్వరాలయ శాసనము. }


శక 1344 - శుభకృత్కార్తిక కృష్ణతృతీయ - శ్రీవిష్ణువర్ధన మహారాజు అయిన శ్రీ నరసింహాదేవర చక్రవర్తులు.. ... .... ధర్మలింగానకు పంచవరక్షకోహళి భంగారానం జేయించి సమర్పించిరి.

(విశాఖపట్నం జిల్లా --పంచదారులో ధర్మలింగేశ్వరాలయ శాసనము. ) ఈ రెండుశాసనములవలనను. శివలింగమునకు అయిదు ముఖములతోఁ జేయించిన 'టోపి' - 'కుళ్ళా'- శిర ఆచ్ఛాదనము అగుట స్పష్టపడినది, తొలి శాసనము సంస్కృత శ్లోకమున ప్రధానభాగము స్పష్టముగాలే దయ్యేను. అచ్చో ఉద్ధీషపద ముండు ననుకొనెదను. శాసనప్రతిబింబము సరిగాఁ బరిశీలింపవలెను.