పుట:Telugu merugulu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

97


" ఎనుత దీవ్యావయవ కాంతీయ
మినుగు మోహరదే? మూడిద
పనిమిషాంగద లుధగ కాయడ
కోహళెయ నుగదు."

(కుమార వ్యాస

నహుషుఁడు సర్పశరీరపుటాచ్ఛాదనమును తొలఁగించు కొనుట యిక్కడ చెప్పఁబడినది. కాన కన్నడ నిఘంటుకారుల ఖరము వ్రాయుట సంగతమే. కుమార వ్యాసునికంటెఁ జాలఁ బ్రాచీనులగు మన తెల్గుకవుల ప్రయోగములు 'ఆచ్ఛాదనము' అన్న యర్ధమునకు ససిపడ వనుకొనెదను. తెలుప్రయోగములు రెండింటికి ('ఉల్లడ' ఒండె 'ఆలవట్టము) ఛత్రము అర్థము కాదగు ననిపించును. హరీవంశపుఁబ్రయోగముఁబట్టి చూడంగా నది వేల్పులకు రాజులు మొదలగువారు పూజాచిహ్నముగా ధరించు ఛత్రచామరధ్వజాదులవంటిదిగాఁ గానవచ్చును. పార్వతీపతి గగనకేశుఁ డుగాన నాదేవుని తలమీఁదికి వచ్చునట్టు ప్రభాతరాజు పైకెత్తిన యాలపట్టమువోలె భానుబింబ మున్న దన్నవర్ణనము సంగతము కాఁ దగును. హరవిలాసప్రయోగము నిందు కనుకూలించును. రాగిడివంటి యలంకారవిశేషమో, కిరీటమో యనుకొందమన్న 'నలరుఁగెందెమ్మి' పదమునకు తామరపూవునాకృతిగలది యని చెప్పవచ్చును గాని ప్రభాతభూపతి 'కొన్న' యన్న పదమునకు సార్థక్యము కుదురదు. ఆలవట్టము కాని ఉల్లడ కానీ 'యలరుఁగేందమ్మి' యాకృతిగల వని యన్వయింపవచ్చును. ఇట్లేల్ల యోచించితిని; గాని 'కోహళె' పదమునకు సమానార్థకముగా మహరాష్ట్రమున 'భోళి' పదము కల దని కిట్టెన్ వ్రాసినాఁడు. మహారాష్ట్రపు 'భోళె' సులువుగాఁ దెలుఁగున 'కుళా' అయియుండవచ్చును. 'కోహళి' శబ్దమును 'కోహళె, ఖోళి, కుళ్లా; పదములు