పుట:Telugu merugulu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

తెలుగుమెఱుఁగులు


అది యెందాఁకఁ బోఁగలదో అందాఁకఁ బోయికాని నిలువదు' అన్న యర్ధము సంగతము. ఊరిబాట ముగియునట్టి పొలిమేరపట్టు 'అధ్వాంతము -తలపోటము' తిక్కన్న ప్రయోగమున కర్ణ మిదే యని నిరూపించుట కీ క్రింది ప్రయోగము కాటమరాజుకథలోనిది సాధకము ;


“తల పొలమునకుఁ బాటి నిలఁబిడ్డ గోవులను
కలవీలుచుకొన్నట్టు కాదు కయ్యంబు. "


తిక్కన భారతము, కాటమరాజుకథ రెండును నెల్లూరి కావ్యములే , 'తలపొలము' పద మక్కడ వాడుకకలది కాఁబోలును!


కనకస్వామి

బసవపురాణమున---


“జాలిఁబడి కనకములు దమక
వేలిచి కొన్న యావిధమగుఁ దమకు"


అని యున్నది. శివాలయములలో శివనివేదితాన్నాదికము నరకు లక్కడి బోయల కారగింప నిచ్చుట బసవేశ్వరునిపూర్వకాలపు సంప్రదాయము. బసవేశ్వరుఁ. సంప్రదాయము మాన్పించి, యర్చకులచే నారగింపించెను. బోయలు తగవు సాగించిరి. “శివునికి విషము నివేదింతుము, అది మీ రారగింపఁగలరా?" యని బసవన బోయల నడిగెను. “ప్రసాద మారగించి, బ్రదుకఁగోరుదుము గాని ప్రసాదము విషముచేసినఁ దిని చత్తుము గదా?" అని బోయ లనెడుపట్టునఁగల ద్విపద యది. బసవపురాణము ముద్రించనా డీద్విపద యర్ధము నాకు స్పష్టపడలేదు. 'కనకస్వాములు' అనఁగా రసవాదము (బంగారము) చేయువా రనియు, తత్ ప్రక్రియ సరిగా తెలియక తప్పుప్రయోగములు చేసి వారు తమశరీరములనే కాల్చుకొనుచుండుట