పుట:Telugu merugulu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగుమెఱుఁగులు

95


జరుగునుగాఁబోలు ననియు నే నప్పు డనుకొంటిని. ఇటీవల కర్ణాట విద్వాంసులు. శ్రీశేషయ్యంగారు కర్ణాటభారతమున నేతత్సంబంధికథ యుండుటఁ జూపిరీ, అది యిది; అరణ్యపర్వమున యక్షప్రశ్నలసందర్భమున భీమాదులు నలుగురుసోదరులు యక్షునాజ్ఞ మీఱి, నీరుద్రావి చెఱువుదగ్గల నప్పుడు కృత్యకు యక్షదేవత (యముఁడే) ప్రత్యక్షమై "నీవు జాతిగల దేవతవైతేని నాచే నిప్పుడు నిపాతితులయి యెంగిలిపడియున్న యీ నల్వురను నీ వారగింపరాదు. ఎంగిలితిండి తిందువా నీవు నీవదేవత వగుదువు. నా మహత్త్వముముందు నీనీ చదేవతాకార్యక్రమము సాగఁ జాల”దని గద్దింపగా కృత్యాదేవత యప్రయోజకురాలై "అయ్యో, నే నాఁ కలిగానీ వచ్చితినే; ఆహారము కావలెనే” అనెను. "అక్రమముగా నిన్నిట్లు ప్రయోగించిన యాకనక స్వామినే యారగింపు" మని యక్షుఁ డనెను. అట్లే యా కృత్య దుర్యోధన పురోహితునిఁ గనకస్వామినే యారగించెను.


 “కనకన బేల్వె తగుళుడు
కనకననెం బొందు మాతుధర గెసెయు సుయో
ధననపురోహిత సప్పా
కసకస్వామియనె మునిదు కృత్తి గే ఉందళ. "

(పంపభార. 8 ఆశ్వా, 44 ప. }


ఈ కథ సంస్కకృతాంధ్ర భారతములలోఁ గానరాదు. కర్ణాటభారత రచనమునకుఁ బూర్వమే "కనకనిపేల్మి కనకనికే తగిలిన" దన్న సామెత యేర్పడియున్న దని పద్యము తెల్పుచున్నది. తొలుత నీ నానుడి రసవాదకారునిఁబట్టి పుట్టి వాడుకలో నుండఁగాఁ బంపకవి దానిని గొని, దుర్యోధనపురోహితునిఁ గనకస్వామిని సృష్టించి తత్పరము గావించి యుండఁబోలును.