31. యంత్రశాల లెన్నొవ్యర్థపదార్థాలు
నదులలోన విడువ నష్టమగును
కలుగు ప్రాణ హాని కలుషమ్ము వలననే
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
32. మేలు పొందాగానె మొప్పు కృతజ్ఞతల్
చెప్పుచుండ వలయు నెప్పుడెన
చేసినట్టి మేలు చెదరని సంపద
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
33. గర్వమున్నవాడు సర్వమ్ము తనద౦చు
పెద్దవారి ముందు ప్రేలుచుండు
చెడ్డ గర్వముననె శిశుపాలు డణగరా
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
34. ప్రతిదినమ్మువచ్చు వార్తల పత్రికల్
చదువుచుండ వలయు శ్రద్దతోడ
విశ్వ విషయమెల్ల వివరించు పత్రికల్
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
35. ఎంత తెలివి యున్న కొంత అభ్యాసమ్ము
అవసరమ్ములగును అందరకును
పదును పెట్టుకున్న పాడౌను ఖడ్గమ్ము
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
36. అన్యభాష నేర్చుట వసరవ్ముగాని
మాతృభాష నెపు డు మరువరాదు
తల్లి బాస మూల ధనమనుట నిజము
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
12
తెలుగు బాల శతకం