పుట:Telugu bala Satakam PDF File.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

37. దుర్జునుండు చూచు దోషాల నెప్పుడు
మంచి వాడు చూచు మహిత గుణము
మంచి చెడ్డలరసి మన్నింప మేలౌ ను
తెలిసి మెలగ మేలు తెలుగు బాల

                

38.నిప్పు కణీకవొలె నిన్ను గాలు
చెడ్డవారి మైత్రి చేటు దెచ్చి
మంచి జనుల మైత్రి మధురాతి మధురమ్ము
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

39. పుస్తకమ్ము, డబ్బు, పూబోడి యొకసారి
పరులచేతిలోన పడిన యెడల
రావు, వచ్చినపుడు భ్రష్టమై యుండును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

40. పిల్లవాడు తాను తలిదడ్రులయొద్ద
పెరిగిపెద్దయగుచు పేరు పొందు
పండితుండు గాడు ప్రబవించినప్పుడే
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

41. అన్ని వేళలందు అనుకూల ఫలితాలు
వచ్చుననుట వాస్తవమ్ము గాదు
ఓటమి గెలుపునకు బాటలు తీయును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

42. పదమునుచ్చరించు ప్రతిభయుండవలయు
తప్పు తోడ పలుక తగదు పదము
పదము తీరుచూడ పర బహ్మరూపమ్ము
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


తెలుగు బాల శతకం
 

13