పుట:Telugu bala Satakam PDF File.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25. అచ్చులంత మందు నలరు చుండెడి భాష
తెలుగు భాషకాదె తెలిసికొనగ
గానయోగ్యమైన గాంధర్వ మేతెల్గు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

26. అన్ని ఋతువులందు అందుబాటుననుండు
ఎట్టి ఫలములైన నిట్టె తినగ
అమరుచుండు నెపుడు ఆరోగ్యభాగ్యమ్ము
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

27. చెలిమితోడ మెలగు స్నేహితుండుండిన
బాధలన్ని తొలగు పరువు పెరుగు
కష్ట సమయ మందు కాచువాడెహితుడు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

28. ఎదుటివారు మనకు ఏమి చేసిన మేలొ
అట్టి మేలు మనమునందచేయ
జగములోన వెలుగు సహకారభావమ్మ
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

29. అందారానిదాని నాశించకుండంగ
సాధ్యా మైన బాటసాగవలయు
పిండి కొలదె రొట్టెయుండుటచూడమే
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

30. కొండలున్న యపుడె మెండుగా వృక్షాలు
పెరుగుననెడి మాట నెరుగ వలయు
కొండవలన మేలు కొల్లలై యుండును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


తెలుగు బాల శతకం--11


11