పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వసంత, ఆమెమొగడు రాజు!! మేమునలుగురు ఒకరినొకరు చూచు కొన్నాము. మా రాజేశ్వరి నాన్నా "అడుగో, వసంతత్త రాజు మామ" అని అరచినది!

      మాలగురి ఆవస్థ వర్ణింపనలవి కాకుండెను.  చివరకు రాజు నన్ను ఎగదిగ చూచి "మీజ్వరమెలాగున్నదండీ?" అని కుచ్చితముగ కన్నుగొట్టి అడిరినాడు.
     "నా-నా-న నాకు ఇప్పుడు కొంచెం నిమ్మదించినది.' అని నేనే మన్నానో జ్ఞాపకములెదు. తరువాత అతడు వసంత ముసిముసినవ్వులు నవ్వుకొను చుండగా రోషముకలిగి" నిన్నచాలతీవ్రముగానె జ్వరము తగిలియుండెను. డాక్టరు కృష్ణమూర్తిగారు చాలదిట్టముగ క్వైనా చేర్చి మందిచ్చినారు.  నేడు పీడవదలినది." అనిసమర్దించితిని.
     "నేడు మధ్యాహ్మము పిళ్లెగారు రెండు టిక్కట్లు పంపినారు. నేటితేది వేసి యుండినందున వృధాగా ఏలపాడు చేయవలెనని ఎట్లో బలవంతపఱచి వీరిని లాగికొనివచ్చి నానిక్కడకు" అని పాపాయి అందుకొని ముక్తాయింపు ఇచ్చెను.
     "అయినా, రాజా, నీవు గ్రామాంతరము వెళ్లెదనని వసంతచెప్పినదటకదా? పోలేదేం? "అని విసరు నెక్కిరింతతో అడిగినాను.
   వెంటనే వసంత "వారు బయలు దేరినారు. ఎక్స్ర స్ తప్పిపొయినదని మరల ఇంటికి వచ్చివేసినారు.  మధ్యాహ్మమగు సరికి మాకు ఒక స్నేహితుడు రెండు రిజర్వుడు టిక్కెట్లును పంపినాడు.  ఏదోవృధాపోనేల? వారినేల చిన్నబుచ్చ వలనని ఇక్కడికివచ్చినాము." అని వ్యాఖ్యానం చేయసాగెను.  "పాపము మీతమ్ముడు..........."
       "వానినెట్లో సమాధానము చేయవలెను." అనివసంత తనమగని మొగముచూచెను.  రాజు మొగమటు త్రిప్పికొని తెరవైపుచూచి "శ్రీరంగని శంకరాభరణమును" తతబహుజన్మ లబ్ధముకృతంబు "అని చేగడ  యెత్తుగడలో పాడినది చూచినారా?" అని ప్రస్తావము మార్చెను.
      నాకది గొప్ప బరువు తేల్చినట్లయినది.
     "ఔ నౌను ఆనాడు హార్మోనియం పెంచలయ్య వాయింపలెదు. ఆ అమ్మాయి తాలూకు నాగమణియో యెవరో వాయించినారు.  అతని యెత్తుగడ అలాగుండెను.  అది మీరు గమనించినారా?"
    "గమనించినాను: ఆదా విషయము?"