పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మేమనుకొన్నంత సంతోషమునాడు మాకు కలుగలేదు. రాజువసంతలు ప్రక్కననుండినది మాకు గుండేలపై బండవలె బరువుగనుండెను. వారిరువురు కూడ మీవలెనే సినిమా పూర్తిఅగువరకు మావైపే చూచుచు చూడనట్లు నటించు చు ప్రొద్ధుపుచ్చినారు. చిక్కిచిక్కిరించి, వెక్కిరింపబడి ఉక్కిరి బిక్కిరి ఊపెరాడక ఎట్లో ఆకొంచెముసేపు ఉండి మారాజేశ్వరిపోరు పెట్టుకొన్నదని నెపముపెట్టి వచ్చు నప్పుడు వారితో వెడలక వేరే రిక్షాలో ఇల్లువచ్చిచేరినాము. బయలుదేరు నప్పుడు రాజు మరల కన్నుగొట్టినన్ను చూచి "ఎమండీ రాయప్రోలు సుబ్రహ్యణ్యంగా రద్బుతముగ నటించినారు కదా?" అన్నాడు.

        "ఔను అతనికి ఉంచిన మంచి పోర్షనంతయు"---, వాసుగారు మరణించిన తరువాత తీసివేసి నారట పాపము లేకుండిన అతనితో సమానముగ సంగీత సాహిత్య నాట్యాహార్యాలలో అడుగుపెట్టు వారేలేరు" అని ఇంక నేదో అనినట్లు జ్ఞాపకము.
                   *            *           *         *
   నాలుగైదు దినములైయుండును. ఒకనాడు పెళ్లెగారు ఆఫీసునకు వచ్చినారు.
       "మీరంపిన టిక్కెట్లవలన మాపాపాయి, మేము సంతోషముగ ఒక్క దినమంతయు గడిపినాము.  చాల సంతోషమండీ పిక్చరేదోసుమారుగనున్నది.
         "ఆహా! బాగానే చూచియుందురు పోనిత్తురుగానీ రాజుగారు ఏమన్నారు?"
     నేనతని నెగదిగ చూచి నక్కనోరు వైచితిని.
    "మీకేలాగు  తెలిసినది వారుకూడవచ్చినారని?"
    పిళ్లె తన చెక్కపంద్ల నిగిలించినాడు. "ఎవ్వరు చెప్పవలెను? మీకు పంపినట్లే టిక్కెట్లను రాజుగారికి కూడపంపితిని. తమాషాకని ఈసంగతి మీకు ప్రత్యేకముగ చెప్పెలేదు. ఏమి, మంచి వేడుక జరిగినదా? చెప్పండి".
       "వేడుకా? ప్రహసనము!"
      "అబ్బ ఎంతపోకిరి పనిచేసినారు మీరు?"
                           -----