పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నది క్షమింపుమని వ్రాసివేసిన రేపుదయము మైలాపూరు చేరును. సంతతి వారికి తెసిసిపోయినదే మరియే చిక్కులేదు."

   "సరిలెండు అలాగే చేయవలె" అనిపాపాయి బాగు ఆలోచించి గొణిగినది.
         *         *             *              *
    నేను ఆఫీసుకు వెల్లి సాయంకాలము ఇంటికి మరల వచ్చినాను. పాపాయి కాఫీపట్టుకొని వచ్చినది. ఆమె మొగములోని సంతోషమును చూచి ఏదో గొప్ప విషయముండునని ఊహించి చూడనివానివలె కాఫీ అందుకొని దృష్టికాఫీపైన బెట్టి ఊరకుంటిని.
   మీకార్డు ముక్కాని మిగిలిన దండీ! నాఅదృష్టము అనగా నేమనుకొన్నారు? ఇంతవరకు వసంతవచ్చి వెళ్లినది.
   పాపము ఆమెమగడు రేపు ఏదోపనిమీద ఊరువిడిచి వెళ్లుచున్నాడట. రేపు తానుకూడ మెరినాకు వెళ్లవీలు లేక పోయినదని ఏడిచినది. తమ్ముడు రేడియోలో పాడినానే, విన్నావా? ఏలాగుండెను? "అనడిగిన ఏమి బదులు చెప్పగలదు? అని కన్నీరు కార్చి వెళ్లినది పాపము మీజబ్బేలాగున్నదో రేపుకబురంపుమన్నది".
     "రేడియో ఎవరింట నైనావినరాదా? మైలాపూరులో ఇప్పుడింటికొక రేడియో ఉంచుకొన్నారు.
    "పోనీ రేపు బయలుదేరు వేళకు మీ ఆడంగి ఆలస్యాలు పెట్టుకోక నీవు రాజేశ్వరి 5 గంటలకు  సరిగతయారయి యుండవలెను. తెలిసినదా?"
                 *          *             *             *         *
    ఫస్ట్ బెల్ అయినప్పుడే లోపల ప్రవేశించినాము.  బ్ర్రాడ్వే టాకీసులో రిజర్వుడు సీట్లకు వెళ్లువారు వేళకుముందేపోయిన నేమి గౌరవము? నేనిది లెక్కపెట్టి చైనా బజారులో పాపాయి మొత్తుకొనుచుండినను బలవంతంగ ఆలస్యము చేయించినాను.
   చీకటిలోటార్చి లైటు చూసి కుఱ్ఱవాడు మాకు సీట్లను కనబరచి కూర్చుండు డని వెళ్లినాడు.
    రిజర్వుడులో మేమే అనుకొన్నాము కాని అదివరకే అక్కడ ఇద్దరున్నారు. తెరపై టైటిల్స్ వెళ్లుచుండెను. ఆచీటి పోయినదే ఇండియాపటము వచ్చెను. అప్పుడు పెద్దవెలుతురు పడి కొంచెం హాలును,ప్రక్కన కూర్చువారిని విసరపగచెను. ప్రరరక్కనున్న వారెవ్వరు?,